Begin typing your search above and press return to search.

భూకంపం పుట్టించాడు-భూమార్గం ప‌ట్టించాడు- ద‌టీజ్ జ‌గ‌న్‌!!

``బ‌లం వ్య‌క్తిది కాదు.. శ‌క్తిది``- అంటూ.. తొలి పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ నెహ్రూ ప్ర‌వ‌చించారు.

By:  Tupaki Desk   |   20 April 2024 4:41 AM GMT
భూకంపం పుట్టించాడు-భూమార్గం ప‌ట్టించాడు- ద‌టీజ్ జ‌గ‌న్‌!!
X

భూకంపం పుట్టిస్తాను.. భూమార్గం ప‌ట్టిస్తాను- అంటారు మ‌హాక‌వి శ్రీశ్రీ. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌ను చూస్తే.. అచ్చం అలానే క‌నిపిస్తోంది. పైకి క‌నిపిస్తున్నంత ధీమా.. పైకి క‌నిపిస్తున్నంత ధైర్యం ప్ర‌తిప‌క్ష నాయ‌కుల్లో కానీ, ఆ పార్టీల అధినేత‌ల్లోకానీ.. ఎక్క‌డా మ‌చ్చుకు కూడా క‌నిపించ‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణం. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నుంచి 2014లో పార్టీ పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర‌కు.. అంద‌రిదీ ఇప్పుడు భూమార్గ‌మే!

ఒక‌ప్పుడు క‌నుసైగ‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాల‌ను శాసించిన ఉద్ధండులు సైతం.. జ‌గ‌న్ దెబ్బ‌కు.. ఇప్పుడు ఠారెత్తుతున్న ఎండల‌కు ఓర్చుతూ.. చెమ‌ట‌లు క‌క్కుతూ.. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీధిన వీధినా తిరుగుతున్నా రు. ఇంటింటి బాట ప‌డుతున్నారు. ``నేను నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డం ఎందుకు. ఇక్క‌డ నుంచి ఒక్క పిలుపిస్తే.. ఓట్లు గుట్ట‌లుగా ప‌డ‌తాయ్‌`` అన్న నాయ‌కులు కూడా.. ఇప్పుడు ఓట‌రు దేవుళ్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే శ‌క్తికి మించి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనికి కార‌ణం.. వైసీపీ, సీఎం జ‌గ‌న్‌.

``బ‌లం వ్య‌క్తిది కాదు.. శ‌క్తిది``- అంటూ.. తొలి పార్ల‌మెంటు ఎన్నిక‌ల వేళ నెహ్రూ ప్ర‌వ‌చించారు. ఇప్పుడు అదే ఏపీలోనూ క‌నిపిస్తోంది. అమ‌లు చేస్తున్న సంక్షేమం కావొచ్చు.. ఇంటింటికీ అందుతున్న ప‌థ‌కాలు కావొచ్చు... తాజాగా ఓ స‌ర్వే సంస్థ ఇచ్చిన గ‌ణాంకాల ప్ర‌కారం ఏపీలో సామాన్యుల నుంచి దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల వ‌ర‌కు.. వైసీపీ ప్ర‌భుత్వం మేళ్లు చేసింది. ఏదో ఒక ప‌థ‌కం అందుకున్న కుటుంబాలు 76 శాతం ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఇదే.. వైసీపీ పునాదుల‌ను బ‌లం చేసింది.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన ప్ర‌తిప‌క్షం.. కూట‌మి క‌ట్టింది.. ఇంత‌టితోనూ ప్ర‌శాంతత క‌నిపించ‌డంలేదు. చంద్ర‌బాబు నుంచి ప‌వ‌న్ వ‌ర‌కు.. పురందేశ్వ‌రి నుంచి క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల వ‌ర‌కు.. ప్ర‌తి ఇల్లూ తిరుగుతున్నారు. వాస్త‌వానికి 2019, 2014 ఎన్నిక‌ల ప్ర‌చారాలు చూస్తే.. వాటికి రెట్టింపు వ్యూహాల‌తో ఇప్పుడు నాయ‌కులు చెమ‌ట‌లు క‌క్కుతున్నారు. అంతేకాదు.. కుటుంబాల‌కు కుటుంబాలే రంగంలోకి దిగిపోయి.. ర‌చ్చ చేస్తున్నాయి. మ‌రోవైపు.. అనుకూల సంస్థ‌ల‌తో ప్ర‌చారాలు.. సోష‌ల్ మీడియా జోరు వంటివి గ‌మ‌నిస్తే.. 2009కి మించిన ప‌రిణామాలు క‌ళ్ల‌కు క‌డుతున్నాయి.

నారా కుటుంబం నుంచి 45 ఏళ్ల రాజ‌కీయాల్లో ఎన్న‌డూ రోడ్డెక్క‌ని నారా భువ‌నేశ్వ‌రి, నంద‌మూరి కుటుం బం నుంచి ఏనాడూ.. పేద‌ల ఇళ్ల‌కు కూడా వెళ్ల‌ని నంద‌మూరి వ‌సుంధ‌రాదేవి వంటి వారు.. ఇప్పుడు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు తిరుగుతున్నారంటే.. బొట్టు పెట్టి బ్ర‌తిమాలుతున్నారంటే ఇది ఎవ‌రి మ‌హిమ‌? 35 ఏళ్ల‌పాటు.. కుప్పం నుంచి విజ‌యం ద‌క్కిం చుకున్న చంద్ర‌బాబు.. తాజాగా ఇక్క‌డ ప్ర‌త్యేక మేనిఫెస్టో ప్ర‌క‌టించే ప‌రిస్థితి రావ‌డం.. ఆయ‌న రాజ‌కీయ జీవితంలోనే తొలిసారి. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు మాసాల కాలంలో 130 స‌భ‌లు నిర్వ‌హించారు. 180 రోడ్ షోలు చేశారు. కానీ, ఎక్క‌డో ఇంకా డౌటే. అందుకే వ‌చ్చే 15 రోజుల్లో 200 స‌భ‌ల‌కు ప్లాన్ చేశారంటే.. ఇది ఎవ‌రి మ‌హిమ‌?

ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డం త‌ప్పుకాక‌పోయినా.. సుదీర్ఘ 40 ఏళ్ల జీవితంలో తొలిసారి.. ఇలా వ‌గ‌ర్చుతుండ డం ఖ‌చ్చితంగా వైసీపీ ఎఫెక్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో తాను స్వ‌యంగా పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. రెండు సార్ల‌కు మించి ప్ర‌చారం చేయ‌ని ప‌వ‌న్‌.. ఇప్పుడు ఒకే నియోజ‌క‌వ‌ర్గం అందునా.. కూట‌మి.. పైగా కాపులు ఎక్కువ‌గా ఉన్నా.. డౌట్ కొట్టేస్తోంది. దీంతో ఇప్ప‌టికే 5 సార్లు ప‌ర్య‌టించారు. ప్ర‌చారం చేసుకున్నారు. ఇక‌, నేటి నుంచి ఆయ‌న మ‌రో 4 సార్లు పిఠాపురంలోనే స‌భ‌లు పెట్టుకోనున్నారు.

ఇక‌, ఏనాడూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించి ప్ర‌చారం చేయ‌ని నంద‌మూరి బాల‌య్య‌.. ఇప్పుడు స్వ‌ర్ణాధ్ర సాకార యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌డం.. వైసీపీ ఎఫెక్ట్ కాద‌నే ధైర్యం ఎవ‌రికీ లేదు. అదేస‌మ‌యంలో ఎన్నారై ల‌ను దింపేస్తున్నారు. సోషల్ మీడియాను ప‌రుగులు పెట్టిస్తున్నారు. అభ్య‌ర్థుల‌కు టికెట్‌లు ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా మార్చేస్తున్నారు. మొత్తంగా.. ఇప్పుడు పేద‌ల గుడిసెలు.. మ‌ధ్య త‌ర‌గ‌తి స‌మస్య‌లు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు క‌నిపిస్తున్నాయి. వారిని భూమార్గం ప‌ట్టించేలా చేస్తున్నాయి.

ఏదేమైనా.. జ‌గ‌న్ ఓడిపోతారా.. గెలుస్తారా.? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇంత మంది ఉద్ధండులు, హేమాహేమీలు.. పేద‌ల ఇళ్ల‌కు క్యూక‌ట్ట‌డం.. వారి స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా విన‌డం.. ఖ‌చ్చితం గా జ‌గ‌న్ మ‌హిమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే భూకంపం పుట్టించాడు-భూమార్గం ప‌ట్టించాడు- ద‌టీజ్ జ‌గ‌న్‌!! అని అన‌కుండా ఉండ‌లేక పోతున్నారు. మ‌రి ప్ర‌జా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.