Begin typing your search above and press return to search.

షర్మిల మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన జగన్...!

ఇప్పటిదాకా జగన్ షర్మిల గురించి ఒక్క మాట కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం తన చెల్లెళ్ళు ఇద్దరు అని ఆయన ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   27 March 2024 4:07 PM GMT
షర్మిల మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన జగన్...!
X

అధికారం కోసం రాజకీయ లబ్ది కోసం తన వాళ్ళు ఒకరిద్దరు తపించి పోతున్నారు అని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ హాట్ కామెంట్స్ చేశారు. తన వాళ్ళు ఒకరిద్దరు చంద్రబాబుతో జత కట్టి తన మీదనే దాడి చేస్తున్నారు అని జగన్ విమర్శించారు.

ఇప్పటిదాకా జగన్ షర్మిల గురించి ఒక్క మాట కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైం తన చెల్లెళ్ళు ఇద్దరు అని ఆయన ప్రస్తావించారు. అందులో సొంత చెల్లెలు షర్మిల ఒకరు అయితే వివేకా కుమార్తె సునీత మరొకరు. ఈ ఇద్దరే ఇటీవల కడపలో వివేకా అయిదవ వర్ధంతి వేళ కూడా జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు.

దానికి బదులు అన్నట్లుగా జగన్ ప్రొద్దుటూరు సభలో మాట్లాడుతూ తన ఇద్దరు చెల్లెళ్లూ విపక్షం వైపు ఉన్నారని క్లారిటీగా చెప్పేశారు. అంతే కాదు వారిని వెనక నుంచి నడిపిస్తున్న శక్తి చంద్రబాబు అని కూడా తేల్చేశారు.

తన సొంత చిన్నాన్న వివేకాను హత్య చేసిన నిందితుడు బయట తిరుగుతూంటే వీరంతా అతనికి మద్దతుగా ఉన్నారు అని కూడా ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ లబ్ది కోసం తపన పడుతున్నారు అని ఆయన షర్మిల మీద చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ గట్టిగానే తగిలేవే అని అంటున్నారు.

నిజానికి 2019 ఎన్నికల వేళ షర్మిల వైసీపీ వైపు ఉండి ప్రచారం చేపట్టారు. బై బై బాబు అంటూ ఆమె ఆనాడు ఏపీ అంతా తిరిగారు. ఇపుడు చూస్తే ఆమె తొలుత సొంత పార్టీ పెట్టారు. తెలంగాణాలో తిరిగారు. అక్కడ పార్టీని మూసేసి ఏపీకి వచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె ఏపీలో గత మూడు నెలల నుంచి జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

వాటికి ఎన్నడూ బదులు చెప్పని జగన్ ఎన్నికల సభలో మాత్రం ఉన్న విషయం చెప్పేశారు. రాజకీయ లబ్ది కోసమే షర్మిల చంద్రబాబు వైపు వెళ్లారని ఆయన అంటున్నారు. అంతే కాదు తన చెల్లెళ్ళ తో తనకు విభేదాలు కూడా రాజకీయ లబ్ది వారిలో ఉండడం వల్లనే వచ్చాయని కూడా జగన్ చెప్పినట్లు అయింది. ఏది ఏమైనా షర్మిలను ఆడిస్తున్నది చంద్రబాబు అని జగన్ ప్రజల సాక్షిగా చెప్పడం విశేషం.

కలియుగం కాకపోతే తన వారే తనకు ఎదురుతిరుగుతారా అని కూడా జగన్ అంటున్నారు. షర్మిల రాజకీయం వెనక ఆమె లబ్ది ఉందని అధికార తపన ఉందని జగన్ స్పష్టం చేసినట్లు అయింది. అంటే ఆమె 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అధికారం లో వాటా కోరుకున్నారు అని ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో నిజం ఉందా అన్న దానికి జగన్ చేసిన కామెంట్స్ నుంచే జవాబులు వెతుక్కోవాల్సి వుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు వెనక అంతా చేరారు తనను ఒంటరిని చేశారు. తన ఫ్యామిలీలో ఇద్దరు అటు వెళ్లారు అని ఏపీ పొలిటికల్ స్టోరీని జగన్ ప్రజలకు వివరించడమే కాదు కడప జిల్లా తన సొంత కుటుంబం అని చెప్పుకున్నారు. ప్రజలకు అన్నీ తెలుసు అని వారి మద్దతు తనకే అని కూడా జగన్ చెప్పడం విశేషం.

ఇక జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఇడుపులపాయలో జరిగిన కార్యక్రమానికి హాజరు కావడం యధాప్రకారం ఆమె కుమారుడి మీద అభిమానాన్ని చాటుకోవడం చూసిన వారు అంతా తల్లి మద్దతు తనయుడికే అని అంటున్నారు. అంతే కాదు మొత్తం 750 మంది దాకా ఉన్న వైఎస్సార్ ఫ్యామిలీలో ఆ ఇద్దరే తప్ప మిగిలిన వారు అంతా తనవారే అని జగన్ కూడా ప్రొద్దుటూరు సభ సాక్షిగా చెప్పడం విశేషం.