Begin typing your search above and press return to search.

లోటస్ పాండ్ కి జగన్ దూరం అందుకేనా ?

ఇక జగన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడడంతో మాజీ సీఎం అయ్యారు. జగన్ తిరిగి లోటస్ పాండ్ కే వెళ్తారు అని అంతా అనుకున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2024 3:00 AM GMT
లోటస్ పాండ్ కి జగన్ దూరం అందుకేనా ?
X

జగన్ రాజకీయానికి అచ్చి వచ్చింది లోటస్ పాండ్. జగన్ వైఎస్సార్ మరణానంతరం రాజకీయం నెరిపింది పార్టీ పెట్టి గెలిచింది కాంగ్రెస్ మీద తొడ కొట్టింది ఏపీలో బలమైన నేత ఎదిగింది అన్నీ లోటస్ పాండ్ నుంచే. జగన్ కేరాఫ్ లోటస్ పాండ్ అన్నట్లుగా 2019 దాకా పాలిటిక్స్ సాగింది. ఇక జగన్ 2019 ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ని కట్టించుకుని అందులోకి తన మకాం మార్చారు.

ఏపీ సీఎం గా అయిదేళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆ మధ్యలో ఆయన లోటస్ పాండ్ కి వెళ్ళింది లేదు. అయితే జగన్ సీఎం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకున్నది లేదు. జగన్ సైతం ఏపీ గడప దాటిపోకుండా అంతా చేసుకుని వచ్చారు.

ఇక జగన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడడంతో మాజీ సీఎం అయ్యారు. జగన్ తిరిగి లోటస్ పాండ్ కే వెళ్తారు అని అంతా అనుకున్నారు. కానీ జగన్ ఓడాక అడుగు పెట్టనిది అక్కడికే. జగన్ హైదరాబాద్ కూడా వెళ్లలేదు. జగన్ ఎన్నికలు ముగిసాక యూకే టూర్ ప్లాన్ చేశారు. అక్కడ నుంచి వచ్చారు. రిజల్ట్స్ తరువాత జగన్ విశ్రాంతి కోసం అని పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లారు. ఇపుడు సెకండ్ టైం ఆయన అక్కడికే వెళ్లారు.

జగన్ హైదరాబాద్ వైపు చూడడం లేదు. అంతే కాదు తనకు పొలిటికల్ గా కలసి వచ్చిన లోటస్ పాండ్ ని కూడా కన్నెత్తి చూడడంలేదు. దానికి కారణాలు ఏంటి అని చూస్తే లోటస్ పాండ్ అన్నది వైఎస్సార్ హయాంలో నిర్మించినది అని అంటున్నారు. అది ఉమ్మడి ఆస్తిగా ఉంది. అందుకే అక్కడ షర్మిల ఉంటోంది.

ఆమె జగన్ తాడేపల్లి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి లోటస్ పాండ్ లో ఉంటోంది. ఆమె తన వైఎస్సార్టీపీ పార్టీని అక్కడే స్థాపించారు. రెండేళ్ల పాటు అక్కడే నడిపారు. ఇక ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన మొత్తం రాజకీయాలను నిర్వహిస్తున్నారు.

ఆమె పూర్తిగా లోటస్ పాండ్ ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు అని అంటున్నారు. అందుకే జగన్ హైదరాబాద్ కానీ లోటస్ పాండ్ కానీ అసలు ఊసే తలవడం లేదు అని అంటున్నారు. అయితే బెంగళూరులో జగన్ ఏకంగా 27 ఎకరాలలో యెహలంక ప్యాలెస్ ని కట్టుకున్నారు. అది కట్టుకున్న తరువాత జగన్ పట్టుమని పది రోజులు కూడా ఉండలేదని అంటున్నారు.

ఆయన ఎంపీ కావడం తండ్రి మరణం తరువాత రాజకీయంగా బిజీ కావడంతో ఎక్కడా గ్యాప్ రాలేదు. చివరికి ఏపీకి మాజీ సీఎం అయ్యాకనే జగన్ కి తీరుబాటు దొరికింది అని అంటున్నారు. అందుకే తాజాగా మరోసారి జగన్ బెంగళూరు వెళ్లారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ కి లోటస్ పాండ్ అచ్చి వచ్చింది. యెహలంక ప్యాలెస్ రాజకీయంగా కలసి వస్తుందా అన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో జగన్ లోటస్ పాండ్ లో ఇప్పట్లో అడుగు పెట్టరా అన్న చర్చ సైతం నడుస్తోంది.

జగన్ ఉంటే తాడేపల్లి లేకపోతే యెహలంక వయా పులివెందుల అన్నట్లుగా 2024 ఎన్నికల తరువాత పాలిటిక్స్ మారింది. మరి లోటస్ పాండ్ లో జగన్ రాజకీయం దూకుడుగా సాగేది. ఎన్నో వ్యూహాలు అక్కడ నుంచే ఆయన రూపకల్పన చేశారు. మరో వైపు చూస్తే ఏపీకి చెందిన నేతలు అంతా హైదరాబాద్ చిరునామాగానే ఉంటున్నారు.

ఒక్క జగన్ మాత్రం బెంగళూరు ని రాజకీయ విడిదిగా చేసుకున్నారు. ఆస్తి గొడవల వల్లనే షర్మిలకు జగన్ మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ ఉమ్మడి ఆస్తి అయినా జగన్ ఆ వైపు తొంగి చూడడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. సో లోటస్ పాండ్ జగన్ అని 2019 దాకా ప్రత్యర్ధులు విమర్శలు చేశారు. ఇపుడు యెహలంక ప్యాలెస్ కి ముడిపెడతారేమో చూడాల్సి ఉంది.