Begin typing your search above and press return to search.

జగన్ ఈజ్ బ్యాక్...క్యాడర్ ఈజ్ నాట్ ఇన్ ఫ్రంట్ !

దానికి కారణం ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న హత్యాచారాలు ఒకటైతే రెండవ వైపు ఎలా బయటకు రావాలో ఇంతకాలం తెలియని ఒక సందిగ్దావస్థలో వైసీపీ ఉండడం కూడా అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 9:59 AM GMT
జగన్ ఈజ్ బ్యాక్...క్యాడర్ ఈజ్ నాట్ ఇన్ ఫ్రంట్ !
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ యాక్టివ్ అయ్యారు. ఆయనలో మునుపటి ఆవేశం కనిపిస్తోంది. ఆయన దూకుడు రాజకీయాన్ని స్టార్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా చూస్తే వైసీపీ నిద్రాణమైన అవస్థ నుంచి బయటకు వస్తోంది. దానికి కారణం ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న హత్యాచారాలు ఒకటైతే రెండవ వైపు ఎలా బయటకు రావాలో ఇంతకాలం తెలియని ఒక సందిగ్దావస్థలో వైసీపీ ఉండడం కూడా అని అంటున్నారు.

ఏపీలో లా అండ్ ఆర్డర్ టాపిక్ మీద ఇపుడు వైసీపీ ఫోకస్ చేస్తోంది. దీని వల్ల తమ పార్టీ వారిని కాపాడుకోవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా తాము ఉన్నామని గట్టి హెచ్చరిక పంపడం అన్న మాట. అందుకే జగన్ గేర్ మార్చేశారు

వినుకొండలో రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించడం నుంచి ఆ తరువాత గవర్నర్ కి వినతి ఇవ్వడంతో పాటు ఢిల్లీలో ధర్నా చేయడం వంటివి చాలా జోరుగా సాగుతున్నాయి. ఇక అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైసీపీ చేసిన నిరసన కూడా ఆ పార్టీ స్టాండ్ ని తెలియచేస్తోంది.

గవర్నర్ ప్రసంగం అంటే ప్రభుత్వం తయారు చేసి ఇచ్చేదే. అందులో తమ ప్రభుత్వం గురించి బాగా చెప్పుకుంటారు, విపక్షం తప్పులు చేసింది అని చెబుతారు. ఈ పరిణామాల నేపధ్యంలో ప్రభుత్వ విధానాలను నిరసించడం కూడా వైసీపీ ఎంచుకున్న మరో మార్గం.

ఇక అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమంల్యేలు ఎమ్మెల్సీలు ప్లే కార్డులతో నిరసన ప్రదర్శన జరిపారు. జగన్ సహా అంతా నల్ల కండువాలను మెడలో వేసుకున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేల చేతులలో ఉన్న ప్లే కార్డులను తీసుకోవడం వాటిని చించడంతో జగన్ కి కోపం కట్టలు తెంచుకుంది.

అక్కడ ఉన్న పోలీసు అధికారులను ఉద్దేశించి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యమని చెబుతూ రోజులు ఎపుడూ ఒకేలా ఉండవని కూడా హెచ్చరించారు. ప్లే కార్డులు తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పోలీసు టోపీ మీద ఉండే మూడు సింహాల గురించి కూడా జగన్ చెబుతూ ప్రజా స్వామ్యాన్ని రక్షించాలని కోరారు.

ఇలా జగన్ గట్టిగా మాట్లాడిన సందర్భం అయితే గత కొన్నేళ్ళుగా లేదు అని చెప్పాలి. అసలు ఆ అవసరం కూడా రాలేదు అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జగన్ ఫైర్ కావడంతో జగన్ ఈజ్ బ్యాక్ అన్ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

జగన్ పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని వారు పేర్కొంటూ ఇది కదా జగన్ అంటే అని చెబుతున్నారు. పాత జగన్ ని గుర్తు చేశారు అని పోస్టులు పెడుతున్నారు. అయితే పాత జగన్ గా ఆయన మారిపోవచ్చు కానీ పాత క్యాడర్ అలాగే ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే క్యాడర్ వైసీపీకి దూరం అయింది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

జగన్ అయిదేళ్ళ పాలనలో తీవ్రంగా నష్టపోయి అన్యాయం అయిన క్యాడర్ కి ఈ రోజుకీ భరోసా లేదని అంటున్నారు. వారితో సమావేశాలు పెట్టి వారిని దగ్గరకు తీసుకుని గతంలో జరిగిన పొరపాట్లు లేకుండా చూస్తామన్నది చేయల్సినది.

అయితే ఆ దిశగా ఎంతవరకూ అడుగులు పడ్డాయో తెలియదు కానీ క్యాడర్ మాత్రం ఇంకా స్తబ్దుగానే ఉంది. వారిలో యాక్టివ్ నెస్ తేవాలీ అంటే జగన్ ఇంకా మారాలని అంటున్నారు. పాత జగన్ అంటే క్యాడర్ ఉవ్వెత్తిన కెరటంలా ఎగిసిపడి వచ్చేదని అలాంటిది మళ్లీ రావాలన్నా వైసీపీకి కళ కట్టాలన్నా క్యాడర్ విశ్వాసం పొందాలని అంటున్నారు.

క్యాడర్ ని పక్కన పెట్టి ఎన్ని చేసిన నేల విడిచి సాము చేసినట్లే అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ ఈజ్ బ్యాక్ క్యాడర్ ఈజ్ నాట్ ఇన్ ఫ్రంట్ అని కూడా కామెంట్స్ పడుతున్నాయి. సో వైసీపీ కి ఇది ఆరంభమే తప్ప మరేమీ కాదు అని అంటున్నారు. ముందు ముందు వైసీపీ దూకుడు చేయాలంటే ఇది అసలు సరిపోదు అని కూడా అంటున్నారు.