జగన్ అంటేనే ఒక సంచలనం...!
జగన్ అంటే మూడు అక్షరాలే. కానీ ఆ పేరులోనే పవర్ ఉంది. గన్ కి ఉన్నంత ఫైర్ ఉంది. జగన్ అంటేనే సంచలనంగా కూడా చెబుతారు.
By: Tupaki Desk | 13 Dec 2023 8:57 AM GMTజగన్ అంటే మూడు అక్షరాలే. కానీ ఆ పేరులోనే పవర్ ఉంది. గన్ కి ఉన్నంత ఫైర్ ఉంది. జగన్ అంటేనే సంచలనంగా కూడా చెబుతారు. ఏపీ రాజకీయాల్లో దూకుడు పాలిటిక్స్ ని ప్రవేశపెట్టిన ఘనత జగన్ కే దక్కింది. ఎవరైనా ఒక స్థాయి దాటి ముందుకు వెళ్లడానికి ఆలోచిస్తారు. కానీ ఆకాశమే హద్దు అన్నట్లుగా జగన్ దూకుడు ఉంటుంది. జగన్ మార్క్ అది. ఆయన అల్టిమేట్ పాలిటిక్స్ చేస్తారు అని అంటారు.
జగన్ గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో దేశంలో బలమైన నాయకురాలిగా ఉన్న సోనియా గాంధీనే ఎదిరించి జాతీయ స్థాయిలో హైలెట్ అయ్యారు. ఆ మీదట ఆయన ఏకంగా పదహారు నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఎక్కడా తగ్గడం జగన్ పొలిటికల్ డిక్షనరీలో లేదు అనే చెప్పాలి. కొండను ఢీ కొట్టడం ప్రతికూల పరిస్థితులను సైతం అలవోకగా ఎదుర్కోవడం తుపాను ముందు నిశ్శబ్దం లాంటి గంభీరత జగన్ సొంతం.
రాజకీయాల్లో ఉన్న వారికి గుండె దిట్టంగా గట్టిగా ఉండాలి. కానీ జగన్ గుండెని అందులో ఉన్న గట్స్ ని కొలించేందుకు ఏ పరికరమూ సరిపోదు అంటారు. ఆయన ఏటికి ఎదురీదడమే నేర్చుకున్నారు అని అంటారు. ఆయనకు పట్టుదల ఎక్కువ పట్టు తప్ప విడుపు తెలియదు అని కూడా అంటారు. అందుకే జగన్ ఒక స్పెషల్ ఫిగర్ గా పాలిటిక్స్ లో నిలిచి ఉన్నారు.
ఇదిలా ఉంటే జగన్ జీవితంలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. అందులో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేయడం కూడా ఉంది. అలుపు సొలుపూ లేకుండా కొండలు ఎండలను దాటుకుంటూ ముందుకు సాగే జగన్ని చూసి జనాలు ఆయనకు నీరాజనాలు పట్టారు. అలా జగన్ కి 151 సీట్లు 2019 ఎన్నికల్లో దక్కాయి. అంతే కాదు 22 ఎంపీ సీట్లు కూడా లభించాయి. 50 శాతానికి పైగా ఓట్ల షేర్ జగన్ సొంతం.
ఇక 2024కి కూడా జగన్ తన గుండె ధైర్యాన్ని తనకు మాత్రమే సాధ్యమయ్యే వ్యూహాలను గట్టిగా నమ్ముకుంటున్నారు. ఈసారి జగన్ స్లోగన్ చూసిన ప్రత్యర్ధులు సెటైర్లు వేయవచ్చు కానీ జగన్ గట్స్ కి మాత్రం వై నాట్ 175 స్లోగన్ కచ్చితంగా యాప్ట్ అవుతుంది అని అన్న వారూ ఉన్నారు. ఇక జగన్ చూస్తే 2024 ఎన్నికలలో ఏకంగా 80 మంది దాకా ఎమ్మెల్యేలను మార్చేస్తారు అని టాక్ అయితే నడుస్తోంది. అంటే మొత్తం 151లో మిగిలేది 70 మంది మాత్రమే పాతవారు అన్న మాట. ఇక మిగిలిన 24 సీట్లలో కూడా కొత్త ముఖాలు ఉంటాయనడంలో డౌటే లేదు.
ఇది కనుక వైరల్ అవుతున్న తీరు బీభత్సంగా ఉంది. ఇది జాతీయ రాజకీయాల్లోనే రికార్డుగా చెప్పాలి. ఎక్కడైనా ఎవరైనా మార్పు చేర్పులు చేస్తే ఒక పది ఇరవై శాతం చేస్తారు. కానీ ఏకంగా యాబై శాతం పైగా సిట్టింగులను మార్చాలని జగన్ నిర్ణయం తీసుకుంటే మాత్రం సంచలనానికే తాత లాంటి నిర్ణయం అని అంటున్నారు.
ఈ విధంగా జగన్ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు అని ఒక ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఇప్పటి దాకా సాగిన ఓల్డ్ ట్రెండ్ పాలిటిక్స్ ని ఆయన వెనక్కి నెట్టి తానే ట్రెండ్ సెట్ చేస్తున్నారు అని అంటున్నారు. రాజకీయాల్లో చూస్తే ఎవరికైనా ఒకసారి టికెట్ ఇస్తే ఆయన తానుగా రిటైర్ కావాలి తప్ప ఆ సీటు అయితే ముట్టుకునేందుకు అధినాయకత్వం కూడా చాన్స్ తీసుకోదు. కానీ జగన్ మాత్రం అలా కాదు ఒక చాన్స్ ఇచ్చాం, అయినా పనిచేయకపోయినా లేక జనాదరణ లేకపోయినా ఎందుకు కంటిన్యూ చేయడం అన్నది ఫిలాసఫీగా పెట్టుకున్నారు.
అదే టైంలో పార్టీలో ఉన్న లక్షలాది కార్యకర్తలలో మరొకరికి ఆ చాన్స్ వస్తుంది కదా అని వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా బీసీ , లోయర్ కాస్ట్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తూ జగన్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం కనుక సక్సెస్ అయితే పాలిటిక్స్ లో వన్ టెర్మ్ ఎమ్మెల్యేలే ఫ్యూచర్ లో కనిపించినా ఆశ్చర్యం లేదు. జనాలకు కూడా బోలెడు ఆప్షన్లు ఉంటాయి. ఏది ఏమైనా ఇలాంటివి చేయాలంటే గట్స్ ఉండాలి. జగన్ కి మరో పేరు గట్స్ కాబట్టి ఆయన మాత్రమే ఇలాంటివి చేయగలరు. సో జగన్ అంటే సంచలనం అని మరోమారు రుజువు చేయబోతున్నారు.