బాలక్రిష్ణ, పవన్ కల్యాణ్ లకు ఇచ్చినవి కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లే : జగన్
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ల్యాండ్ చట్టాలపై ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్ ప్రజల భూములకు పట్టాలివ్వకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి
By: Tupaki Desk | 11 May 2024 8:24 AM GMTఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ల్యాండ్ చట్టాలపై ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్ ప్రజల భూములకు పట్టాలివ్వకుండా చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం ఇస్తున్నారు. భూములు పట్టాలు చేయించుకున్న వారికి డాక్యుమెంట్లు ఇచ్చారా? లేదా అని అడుగుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారం అని మండిపడ్డారు.
బాలక్రిష్ణ రిషి కొండలో, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మంగళగిరిలో భూములు కొన్నారు. వారికి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఎక్కడ కూడా చట్టం నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాం తప్ప ప్రజల ఆస్తులను తీసుకోవాలనే ఆశ లేదని చెబుతున్నారు. విపక్షాల విచిత్రంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రజల భూములను తమ దగ్గర పెట్టుకుంటున్నారని అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇచ్చాం. చంద్రబాబు కుట్రలతో పథకాల రూపురేఖలు మార్చాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిపాలనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నాం. ప్రజల అవసరాలు తీర్చే పథకాలే ప్రవేశపెడుతున్నాం కానీ వారికి నష్టం కలిగించే వాటి జోలికి వెళ్లడం లేదు.
ప్రజల కోసం నగదు పంపిణీ చేశాం. పలు పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో నగదు జమ చేశాం. కానీ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. నీతి నిజాయితీతోనే పనులు చేశాం. ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రగానే అభివర్ణించారు. భవిష్యత్ లో కూడా ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అందజేస్తాం. కానీ ఎలాంటి అవకతవకలకు పాల్పడబోమని తేల్చి చెప్పారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పాటుపడతాం. ఇంకా పలు పథకాలు ప్రారంభించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తాం. అంతేకాని ప్రజలకు ఎలాంటి సమస్యలు లేని జీవితాన్ని ప్రసాదించడమే మా లక్ష్యమని జగన్ ఎలుగెత్తి చాటారు. మంచి పాలన అందించేందుకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు.