Begin typing your search above and press return to search.

వైసీపీ ఓడిపోతుంది అని జగన్ కి లండన్ టూర్ లోనే తెలిసిందా ?

వైసీపీ ఓటమి గురించి జగన్ కి లండన్ టూర్ లోనే తెలుసు అన్నది ఇపుడు వైసీపీలో సాగుతున్న చర్చగా ఉంది అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 10:15 AM GMT
వైసీపీ ఓడిపోతుంది అని జగన్ కి లండన్ టూర్ లోనే తెలిసిందా ?
X

వైసీపీకి కనీ వినీ ఎరగని దారుణమైన పరాజయం పలకరించింది. దేవుడి స్క్రిప్ట్ అని ఎపుడూ చెప్పే వైసీపీకి జూన్ 4న అదే దేవుడు వింతగా కొత్తగా స్క్రిప్ట్ రాసి పెట్టాడు. దానిని ఈ రోజుకీ జీర్ణించుకోలేక వైసీపీ నేతలు సతమతమవుతున్నారు. అయితే ఇదే స్క్రిప్ట్ వస్తుందని జగన్ కి ముందే తెలుసా అన్నదే ఇపుడు వైసీపీలో సాగుతున్న డిస్కషన్.

వైసీపీ ఓటమి గురించి జగన్ కి లండన్ టూర్ లోనే తెలుసు అన్నది ఇపుడు వైసీపీలో సాగుతున్న చర్చగా ఉంది అంటున్నారు. ఇటీవల ఒక ఎమ్మెల్యే జగన్ ని కలసినపుడు జగన్ అన్న మాటలను బట్టి ఆయనకు లండన్ టూర్ లోనే వైసీపీ ఓటమి గురించి తెలుసు అని అర్ధం అయింది అంటున్నారు.

ఇంతకీ ఆ ఎమ్మెల్యేతో జగన్ ఏమి చెప్పారు అంటే అన్నా నేను లండన్ లో ఉన్నపుడు ఎగ్జిట్ పోల్స్ చేసిన సర్వే ప్రకారం వైసీపీకి 45 సీట్లు వస్తాయని అంటే నేను నమ్మలేదు కనీసంగా తొంబై సీట్లు అయినా వస్తాయని అనుకున్నాను కానీ మరీ ఇంత ఘోరంగా 11 సీట్లు రావడం ఏంటి అని అన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

మన దగ్గర ఆధారాలు లేవు కానీ ఇదంతా ఈవీఎంల వల్ల అని నమ్ముతున్నాను అని జగన్ అన్నారట. ఈవీఎంలే ఇదంతా చేశాయని మన దగ్గర ప్రూవ్స్ ఏమీ లేవు కదా అని కూడా అన్నారట. అయినా ఈవీఎంల వల్లనే ఇదంతా అని తాను నమ్ముతున్నట్లుగా జగన్ సదరు ఎమ్మెల్యేకు చెప్పారట.

ఇక అదే ఎమ్మెల్యే అందరికీ 25 కోట్ల రూపాయలు ఇచి తనకు మాత్రం 15 కోట్ల రూపాయలే ఇచ్చారని జగన్ తో మొరపెట్టుకున్నారుట. దాంతో తాను బయట అప్పులు చేసి పది కోట్లు తెచ్చి మరీ ఎన్నికలు చేసి గెలిచాను అని ఆయన చెప్పాడట. తనకు అప్పులు ఉన్నాయని ఆదుకోమని జగన్ ని కోరితే చూద్దామని జగన్ అన్నారని ప్రచారం సాగుతోంది.

ఇదిలా ఉంటే ఓటమి వైసీపీకి ఉంటుందని జగన్ కి ముందే తెలుసు అని అంటున్నారు. అయితే జగన్ లండన్ ట్రిప్ కి వెళ్ళే ముందు ఐ ప్యాక్ ఆఫీసుకుని వెళ్ళి మరీ దేశం మొత్తం చూసేలా ఏపీలో వైసీపీ విజయం ఉంటుందని చెప్పి ధీమా కలిగించారు. దాని వల్ల చాలా మంది వైసీపీ వారు బెట్టింగులు కూడా కట్టేశారు. ఇక లండన్ ట్రిప్ నుంచి వచ్చిన తరువాత కూడా రిజల్త్ కి ముందు జగన్ ట్వీట్ చేస్తూ మళ్లీ మన ప్రభుత్వం అని కూడా చెప్పిన సంగతిని గుర్తు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మనమే గెలుస్తున్నామని చెప్పడమే కాదు, ఫైట్ చేయాలంటూ భారీ డైలాగులు కొట్టడాన్ని గుర్తుకు తెచ్చుకుని వైసీపీ నేతలు లోలోపల మండిపోతున్నారు. ఇంతలా మభ్యపెట్టడం ఎందుకు అని కూడా వారు అంటున్నారు. కనీసం నాయకులను అయినా విశ్వాసంలోకి తీసుకోకుండా జూన్ 9న సీఎం గా రెండోసారి ప్రమాణం అంటూ ప్రకటనలు ఇప్పించడం వంటివి ఎందుకు చేశారు అన్న చర్చ కూడా సాగుతోంది.

అంటే మొత్తం మీద సొంత పార్టీ వారికే మభ్యపెట్టి మబ్బుల్లో ఉంచారని అంటున్నారు. దాని ఫలితంగా చాలా మంది సవాళ్లు చేసి దొరికిపోయారు. కొందరు టీవీ డిబేట్లలో సైతం పెద్ద గొంతుకతో వాదించి చివరికి అభాసుపాలు అయ్యారని గుర్తు చేస్తున్నారు. వీరి కంటే ఎక్కువగా చాలా మంది బెట్టింగులు కాసి ఆస్తులతో పాటు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు అని అంటున్నారు.

దేశంలో చూస్తే బీజేపీ కూడా అనుకున్న నంబర్ దక్కక ఇబ్బంది పడింది. కానీ ప్రతీ దశ పోలింగ్ ని నిశితంగా పరిశీలన చేసుకుంది. బయటకు రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేసినా సొంత పార్టీని అలెర్ట్ చేసింది. అలా మిత్రులను కూడా దగ్గర పెట్టుకుంది. అంటే ప్లాన్ బీ కూడా బీజేపీ ఆలోచించగలిగింది అని అంటున్నారు.

కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం కేవలం తమ మాటే వేదం అన్నట్లుగా ప్రకటనలు విడుదల చేసి చివరికి సొంత పార్టీ వారు కూడా నమ్మలేని పరిస్థితి తెచ్చుకుంది అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీకి ఘోర పరాజయం ఒక ఎత్తు అయితే వైసీపీలో నేతలను అధినాయకత్వం మభ్యపెట్టడం మీదనే చాలా మంది గుర్రుమంటున్నారుట.