చంద్రబాబు మీద జగన్ సంచలన ఆరోపణలు
ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ తరఫున అభ్యర్ధిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు.
By: Tupaki Desk | 2 Aug 2024 12:48 PM GMTవైసీపీ అధినేత జగన్ చంద్రబాబు మీద సంచలన ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ తరఫున అభ్యర్ధిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పార్టీ విజయం మీద జగన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
వైసీపీకి స్థానిక సంస్థలలో పూర్తిగా బలం ఉందని తెలిసినా టీడీపీ పోటీ పెడుతోంది అంటే చంద్రబాబు తీరే అంత అన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఉంది. నిజానికి ఈ సంగతి తెలిసిన మరే పార్టీ పోటీకి సిద్ధపడదు, కానీ చంద్రబాబు మాత్రం నైతిక విలువలను ఏ మాత్రం పాటించే వారు కాదని జగన్ హాట్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏ మాత్రం బలం లేని చోట తమ అభ్యర్ధిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారని అంటున్నారు. అడ్డగోలుగా గెలవడం ప్రలోభాలు బెదిరింపులు చేయడం బాబు నైజమని కూడా జగన్ అన్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు కుయుక్తులు కుట్రలనే ఎపుడూ నమ్ముకుంటారని కూడా జగన్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.
అందువల్ల వైసీపీకి ఈ ఉప ఎన్నికలు చాలా కీలకమని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. పార్టీ నేతలు అంతా ఐక్యంగా ఉండాలని ఆ విధంగా ధీటుగా పనిచేస్తేనే విజయం సాధ్యపడుతుందని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు.
మొత్తం మీద చూస్తే చంద్రబాబు విషయంలో జగన్ అదే ఫైర్ తో దూకుడుగా కామెంట్స్ చేస్తున్నారు. భారీ ఓటమి తరువాత టీడీపీ అధికారం చేపట్టింది, తిరుగులేని విధంగా తయారైంది. కనీసంగా ఎదిరించే పరిస్థితి అయితే వైసీపీకి లేదు. దాంతో కూటమి ముందుకు దూసుకుని పోతూండంగా ఏ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలను వైసీపీ ఒక విధంగా అగ్ని పరీక్షగానే తీసుకుంది. గెలవడం కోసం వైసీపీ సీనియర్ నేత బొత్సను రంగంలోకి దింపడం కూడా అందుకే అని అంటున్నారు. మరెవరినీ దింపినా వ్యూహాలలో కానీ అంగబలం అర్ధబలం విషయంలో కానీ కూటమిని గట్టిగా ఎదుర్కోలేరు అని భావించే బొత్సను ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు పూర్తిగా స్థానిక సంస్థలలో బలం ఉన్న కడప ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. ఆనాడు కూడా చాలా మంది వైసీపీ ప్రజా ప్రతినిధులను లాగేసి విజయం సాధించారని ఆ పార్టీ ఆరోపించింది. ఇపుడు కూడా విశాఖలో కూటమి ధీటుగా నిలబడి సవాల్ చేస్తోంది. మరి వైసీపీ చంద్రబాబుని ఎన్ని ఆడిపోసుకున్నా రాజకీయ రణ క్షేత్రంలో పారేవి ఎత్తుగడలే తప్ప వేరొకటి కావని అంటున్నారు చూడాలి మరి ఏ విధంగా వైసీపీ ఫైటింగ్ ఇస్తుందో.