మోడీ అమిత్ షాలతో జగన్ భేటీ : కీలక అంశాలే అజెండా...?
మరి కొద్ది గంటలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు.
By: Tupaki Desk | 5 Oct 2023 12:30 AM GMTమరి కొద్ది గంటలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ కాబోతున్నారు. ఇద్దరు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్లు ఖరారు కావడంతో ముందు అనుకునన్ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే జగన్ ఢిల్లీ టూర్ చేస్తున్నారు. నిజానికి జగన్ ఈ నెల 6, 7 తేదీలలో ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.
మరో వైపు రేపు ఏపీలో కొన్ని ప్రారంభోత్సవాలు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. అయితే ఒక్కసారిగా మారిన షెడ్యూల్ తో జగన్ గురువారమే ఢిల్లీ చేరుకుంటారు. ఉదయం పది గంటలకు ఆయన విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీలోని జనపధ్ లోకి తన నివాసానికి చేరుకుంటారని తెలుస్తోంది.
ఇక జగన్ 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాలతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాల మీద చర్చిస్తారని తెలుస్తోంది. ఏపీలో గత నెల రోజులుగా చంద్రబాబు జైలులో ఉన్నారు. ఆయన మీద స్కిల్ స్కాం కేసు ఉంది. అయితే ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులలో బాబు మీద విచారణకు సీఐడీ సిద్ధంగా ఉంది.
మరో వైపు చూస్తే అమరావతి రాజధాని స్కాం కూడా తెర మీదకు రానుంది. ఈ విషయంతో పాటు మొత్తం లింక్ ఉన్న అన్నింటికీ కలిపి సీబీఐ విచారణను జగన్ కోరుతారా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తానుగా సీబీఐ విచారణ కోరితే కేంద్రం తప్పకుండా వేస్తుంది అని అంటున్నారు.
దాంతో జగన్ ఢిల్లీ టూర్ మీద ఇపుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. హడావుడిగా జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు వెళ్తున్నారు అని టీడీపీ ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తూంటే తన మీద కేసులను లేకుండా చూసుకోవడం తప్ప జగన్ ఎపుడైనా ఏపీ ప్రజల కోసం ప్రత్యేక హోదా కోసం పోలవరం రాజధాని కోసం కేంద్రంతో ప్రస్తావించారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు.
ఏపీ రాజకీయ నేతల సంగతి ఎలా ఉన్నా జగన్ కీలకమైన అంశాలను కేంద్రం వద్ద ప్రస్తావించేందుకే ఈ టూర్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు చూస్తే చంద్రబాబు అరెస్ట్ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలను పంచుకోనున్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా జగన్ ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి అన్నది కూడా కనుగొనే ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు.
ఇక ముందస్తు ఎన్నికలు అని చాలా మంది అంటున్నారు. అయితే జగన్ మదిలో ఆ విషయం లేదని వైసీపీ నేతలు చెబుతున్న ఇపుడు కరెక్ట్ సమయంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడంతో ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా ఆయన కదుపుతారా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా జగన్ ఈసారి మోడీ అమిత్ షాలతో భేటీ మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూడాలి మరి జగన్ భేటీ తరువాత ఏపీ రాజకీయాల్లో మార్పుచేర్పులు ఎలా ఉంటాయో.