Begin typing your search above and press return to search.

జగన్ మైండ్ గేమ్ లో విపక్షం చిక్కుతుందా...!?

వైసీపీ అధికారంలో ఉంది. దాంతో బెల్లం చుట్టూ ఈగల మాదిరిగా చాలా మంది నేతలు ఉంటారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 4:30 AM GMT
జగన్ మైండ్ గేమ్ లో విపక్షం చిక్కుతుందా...!?
X

వైసీపీ అధికారంలో ఉంది. దాంతో బెల్లం చుట్టూ ఈగల మాదిరిగా చాలా మంది నేతలు ఉంటారు. ఒక విధంగా అధికం చేటు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దాంతో అవసరం ఉన్న వారితోనే టీమ్ ని రెడీ చేసుకోవడంలో జగన్ నేర్పు సాధిస్తున్నారు. టికెట్లు ఇవ్వలేని వారికి ముందే చెప్పేసి తన పని తాను చేసుకుని పోతున్నారు.

అదే సమయంలో వారు అంతా విపక్షంలో చేరుతారు అన్నది తెలియని విషయం కాదు. అలాగే ఇపుడు జరుగుతోంది. ఏపీలో విపక్షం తెలుగుదేశం పరిస్థితి అంతా జగన్ కి తెలియనిది కాదు. వైసీపీకి ఉన్నంతగా వెసులుబాటు టీడీపీకి లేదు. ఆ పార్టీ అధినేత నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితం చూసినా కూడా ఆయన పొత్తు రాజకీయాలు చేస్తున్నారు.

దాంతో ఏదీ స్వతంత్రంగా స్పీడ్ గా నిర్ణయం తీసుకునే వీలు లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక జనసేనతో పొత్తు కొత్త అనుభవంగా ఉంది. గతంలో ఏ పార్టీకి ఇవ్వనన్ని సీట్లు జనసేనకు ఇవ్వాల్సి వస్తోంది. మరో వైపు బీజేపీ లేకపోతే కమ్యునిస్టులు వంటి పార్టీలతో పొత్తులు ఉంటాయని ప్రచారం సాగుతోంది.

ఇవన్నీ టీడీపీకి అతి పెద్ద చిక్కుముడులు అని జగన్ కి తెలుసు. వాటికి తోడు అన్నట్లుగా వైసీపీ నుంచి టికెట్ దక్కని నాయకులు టీడీపీని జనసేనను ఆశ్రయిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం ఇలా జరుగుతుందని తెలిసే ముందే తమ టికెట్ల వ్యవహారం సరి పెట్టేస్తోంది. ఇపుడు మరిన్ని కొత్త చిక్కులతో విపక్షం విలవిలలాడుతోంది.

అందరినీ టికెట్లు సర్దాల్సిన పరిస్థితులు విపక్షంలో ఏర్పడుతున్నాయి. దాంతో అక్కడ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. అది వైసీపీ జనంలోకి దూసుకుపోవడానికి ఒక అవకాశంగా ఉంటే రేపటి రోజున అక్కడ భారీగా పెరిగే అసంతృప్తులు వివాదాలు ఉండనే ఉంటాయి. వాటిని అన్నింటినీ పరిష్కరించుకుని విపక్షం వైసీపీతో పోటీ పడేసరికి పుణ్య కాలం ముగిసిపోతుంది.

మరో వైపు చూస్తే వైసీపీ వద్దు అనుకున్న వారికి టీడీపీ చేరదీసినా జనసేన పిలిచి టికెట్లు ఇచ్చినా జనం తీర్పులో మార్పు ఉండదు కదా అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అయినా సరే విపక్షాలు తాము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి వైసీపీ నుంచి వచ్చిన నాయకులను తీసుకుంటున్నాయి. ఈ విధంగా చేయడం వల్లనే వారు జగన్ మైండ్ గేమ్ లో చిక్కుకుంటున్నారు అని అంటున్నారు

ఉన్న సమస్యలకు కొత్తవి చేరినట్లుగానే ఇపుడు వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం అన్నది విపక్ష శిబిరంలో జరుగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అధినేత తాను అనుకున్నది చేసుకుని పోతున్నారు. ఇక వైసీపీ కొందరు అవుట్ డేటెడ్ అని పక్కన పెడితే వారిని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లినా లేక వారితోనే ప్రజా తీర్పు కోరినా విపక్షానికీ ఇబ్బంది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే విపక్షంలో ముసలం పుట్టడానికి వైసీపీ అసంతృప్తులు అక్కడ చేరి కారణం అవుతున్నారు అని అంటున్నారు. ఇవన్నీ ఊహించిన మీదటనే చాలా డేరింగ్ గా వైసీపీ అధినాయకత్వం టికెట్ల కసరత్తు మొదలెట్టి వేగంగా ముగిస్తోంది అని అంటున్నారు.