Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ వంశీ భుజం తట్టిన జగన్...మ్యాటరేంటి...?

విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సీనియర్ నేత అయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా జగన్ పిలిపించుకుని మరీ భుజం తట్టారన్న వార్త ఇపుడు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశం అయింది.

By:  Tupaki Desk   |   29 Sep 2023 4:48 AM GMT
ఎమ్మెల్సీ వంశీ భుజం తట్టిన జగన్...మ్యాటరేంటి...?
X

విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సీనియర్ నేత అయిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ని అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేకంగా జగన్ పిలిపించుకుని మరీ భుజం తట్టారన్న వార్త ఇపుడు జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశం అయింది. వంశీ వైసీపీ పెట్టిన నాటి నుంచి పనిచేస్తున్నారు. ఆయన రాజకీయ జీవితం ప్రజారాజ్యంతో ఆరంభం అయింది.

ఆయన 2009లో విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పీయార్పీ తరఫున పోటీ చేసి జస్ట్ మూడు వేల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆయన వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఆయనకు పార్టీ 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. అయితే నాడు టీడీపీ వేవ్ లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇక 2019లో అనూహ్యంగా చివరి నిముషంలో ఆయనకు టికెట్ చేజారింది.

మరో వైపు చూస్తే వంశీకి మేయర్ సీటు హామీ ఇచ్చినా ఆ తరువాత మారిన సమీకరణల నేపధ్యంలో ఎమ్మెల్సీగా పంపించారు. ఇపుడు వంశీని జగన్ పిలిపించుకోవడంతో ఆయనను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దింపబోతున్నారా అన్న చర్చ నడుస్తోంది. విశాఖ నుంచి వంశీని ఎంపీ క్యాండిడేట్ గా బరిలోకి దించడం ద్వారా కచ్చితంగా గెలవవచ్చు అని జగన్ స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు.

విశాఖ పార్లమెంట్ పరిధిలో యాదవ సామాజికవర్గం అధికంగా ఉంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సామాజికవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మేయర్ గా వీఎమ్మార్డీయే చైర్ పర్సన్ గా ఎమ్మెల్సీగా వారికే అవకాశాలు ఇచ్చారు. రీసెంట్ గా విశాఖలో యాదవ భవనం కోసం స్థలం కూడా కేటాయించారు.

ఇవన్నీ యాదవులను మంచి చేసుకోవడానికే అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఓసీ అభ్యర్ధినే విపక్షాలు బరిలోకి దించుతాయని అంటున్నారు. బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు ఉంటే జీవీఎల్ నరసింహారావు ఎంపీ క్యాండిడేట్ అవుతారు. అలా కాకుండా టీడీపీ జనసేన పోటీ చేస్తే బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ కి టికెట్ దక్కుతుంది. ఈ ఇద్దరూ ఓసీలే కాబట్టి బీసీ కార్డుతో ముందుకు వెళ్తే గెలుపు తధ్యమని జగన్ భావిస్తున్నారు. అందుకే వంశీని పిలిపించారని అంటున్నారు. వంశీ కూడా ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు. ఆయన వైసీపీలో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పొలిటికల్ ఎలివేషన్ని కోరుకుంటున్నారు అంటున్నారు.

మొత్తం మీద చూస్తే బీసీ ఎంపీ అన్న కాన్సెప్ట్ విశాఖ ఎంపీ సీటులో చాలా దశాబ్దాలుగా లేదు. ఆ మాటకు వస్తే బీసీ అభ్యర్ధి గత అర్ధ శతాబ్దం కాలంగా గెలిచారా అంటే లేదనే అంటున్నారు. అలా ఫస్ట్ టైం ఆ క్యాండిడేట్ నిలబెట్టడం ద్వారా విక్టరీ కొట్టాలని జగన్ చూస్తున్నారు అంటున్నారు.