Begin typing your search above and press return to search.

రెండు నెలల్లో జగన్ విషయంలో సంచలనమేనా ?

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి రానున్న రెండు నెలలూ గడ్డు రోజులేనా అన్న చర్చకు తెర లేస్తోంది

By:  Tupaki Desk   |   6 Jun 2024 4:30 PM GMT
రెండు నెలల్లో జగన్ విషయంలో సంచలనమేనా ?
X

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి రానున్న రెండు నెలలూ గడ్డు రోజులేనా అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే జగన్ మీద 2012 నుంచి కేసులు ఉన్నాయి. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని జగన్ మీద సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల విషయంలో జగన్ పదహారు నెలల పాటు జైలులో ఉన్నారు. ఆయన 2013 సెప్టెంబర్ లో బయటకు వచ్చినప్పటికీ కేసులు మాత్రం అలాగే ఉన్నాయి.

ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసులు సత్వరమే పరిష్కరించాలని అత్యున్నత న్యాయ స్థానం సైతం ఆదేశించింది. ఈ నేపధ్యంలో జగన్ కేసుల విషయం ఇపుడు మరోసారి చర్చకు వస్తోంది. ఆయన పార్టీ వైసీపీ దారుణమైన పరాజయం పాలు అయ్యాక ఇపుడు జగన్ కి కష్టాలు ఒక్కోటిగా చుట్టుముట్టుకుని వస్తున్నాయని అంటున్నారు.

దాంతో పాటు ఆయన మీద పెట్టిన కేసుల విషయంలో విచారణ సీబీఐ కోర్టులో వేగవంతం కానుంది అని అంటున్నారు. జూన్ 19 నుంచి ఈ కేసుల విచారణ సాగనుంది అని అంటున్నారు. రెండు నెలల్లోగా ఈ కేసులను పరిష్కరించాలని తెలంగాణా హై కోర్టు సీబీఐ కోర్టుని ఆదేశించిన నేపధ్యంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ కేసులలో విచారణ ఒక్కసారిగా వేగం పుంజుకునే అవకాశం ఉంది. జగన్ కేసులో 127 మంది నిందితుల విషయంలో డిశ్చార్జి పిటిషనను ఈ నెల 19 నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక మీద ఈ కేసులకు సంబంధించి రెగ్యులర్ విచారణ కొనసాగుతుందని అంటున్నారు. దీంతో జగన్ కూడా ప్రతీ వారం ఈ కేసుల విచారణ సందర్భంగా సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు.

ఏకంగా 13 ఏళ్ల నాటి కేసులు ఇవి. జగన్ తన తండ్రి వైఎస్సార్ సీఎం గా ఉండగా అక్రమంగా ఆస్తులు పోగేసుకున్నారు అన్న ఈ కేసుల విషయంలో రెగ్యులర్ విచారణ కనుక మొదలెడితే ఏ పరిణామాలకు దారి తీస్తాయన్నది చూడాల్సి ఉంది. అనుకున్నట్లుగానే రెండు నెలల వ్యవధిలో ఈ కేసుల విషయంలో విచారణ ముగిసి తీర్పు వెలువడితే మాత్రం సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు.

ఒక విధంగా చూస్తే వైసీపీకి ఇది రాజకీయంగా అత్యంత విషమ పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగన్ కేసుల విషయంలో కీలక పరిణామాలు కనుక చోటు చేసుకుంటే అవి ఎటు వైపునకు దారి తీస్తాయన్న చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా ఏపీలో వైసీపీకి టోటల్ గా బ్యాడ్ డేస్ స్టార్ట్ అయ్యాయనే అంటున్నారు. వీటిని ఫేస్ చేస్తూ ఎలా ముందుకు సాగుతారు అన్న దాని మీదనే పార్టీ ఫ్యూచర్ ఆధారపడి ఉంది అని అంటున్నారు.