Begin typing your search above and press return to search.

చంద్రబాబు వర్సెస్ జగన్ @ 2024

ఏపీలో ఇద్దరే ఇద్దరు, రెండే పార్టీలు, వారి మధ్యనే భీకరమైన పోరు. వారితోనే ఏపీ పాలిటిక్స్. ఏపీలో అధికారం ఎవరిది అంటే జవాబు సింపుల్

By:  Tupaki Desk   |   17 May 2024 12:15 PM GMT
చంద్రబాబు వర్సెస్ జగన్ @ 2024
X

ఏపీలో ఇద్దరే ఇద్దరు, రెండే పార్టీలు, వారి మధ్యనే భీకరమైన పోరు. వారితోనే ఏపీ పాలిటిక్స్. ఏపీలో అధికారం ఎవరిది అంటే జవాబు సింపుల్. అయితే జగన్ ది లేకపోతే బాబుది. ఆరు నెలల క్రితం తెలంగాణలో జరిగిన త్రిముఖ పోరు అయితే ఏపీలో లేదు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికే పట్టం కడతారు జనాలు. అయితే ఆ ఇద్దరిలోనూ ఎవరు అంటే మాత్రమే సంక్లిష్టమైన విషయంగా చూస్తున్నారు.

అంత క్లోజ్ ఫైట్ అయితే ఏపీలో సాగింది అన్నది ఇప్పటి దాకా అందుతున్న విశ్లేషణగా ఉంది. ఇక చంద్రబాబు జగన్ ఈ ఇద్దరికీ బలాలు ఉన్నాయి. అలాగే బలహీనతలూ ఉన్నాయి. ముందుగా చంద్రబాబునే తీసుకుంటే ఆయనకు ఉన్నత వర్గాలుతో పాటు బలమైన వర్గాల మద్దతు దండీగా ఉంది. అంగబలం ఆర్ధబలం ఉన్న వారంతా బాబుకు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు.

అలాగే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తారు, ఏపీకి ఒక దశ దిశ చూపిస్తారు అని భావించే సెక్షన్లు ఉన్నాయి. ఇక వివేకా హత్య కేసు వైసీపీ మీద ప్రయోగించడానికి ఆయనకు ఒక ఆయుధంగా మారింది. అలాగే జగన్ సొంత చెల్లెలు షర్మిల వైసీపీ నుంచి బయటకు రావడం మరింత బలాన్ని ఇచ్చింది. అంతే కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయనకు వజ్రాయుధం అయింది.

ఇక పోలింగ్ సరళిని చూస్తే అర్బన్ ఓటర్లు అంతా గంపగుత్తగా కూటమికే ఓటు వేసారు అని తెలుస్తోంది. అభివృద్ధి లేదు రోడ్లు బాగా లేవు అనేవారు అంతా కూటమికే ఓట్లు వేశారు అని అంటున్నారు. అయితే అమరావతి నినాదం అనుకున్నంతగా పని చేయలేదు అని కూడా వినిపిస్తోంది. అలాగే కూటమి ఇచ్చిన మ్యానిఫేస్టో సైతం జనాలకు పెద్దగా అట్రాక్ట్ గా ఉండలేదని అంటున్నారు. జగన్ యాంటీ ఓటర్లు, అలాగే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం కూటమికి పనిచేసింది అని అంటున్నారు.

ఇదే సందర్భంలో జగన్ గురించి చూస్తే నేరుగా లబ్దిదారుల ఖాతాలోకి రెండు లక్షల కోట్ల డెబ్బై అయిదు వేల రూపాయల నగదుని జగన్ పంచారు. ఇదంతా ఎలాంటి వివక్ష కానీ అవినీతి కానీ లేకుండా డైరెక్ట్ గా లబ్దిదారుల ఖాతాలోకే వెళ్ళింది. ఇది ఒక మంచి పాయింట్ గా ఉంది. ఇక ప్రతీ యాభై కుటుంబాలకు వాలంటీర్లను పెట్టి జగన్ తన ప్రభుత్వ పధకాలను వారి ద్వారా చాలా పద్ధతిగా పంపిణీ చేయించారు అన్న పేరు ఉంది.

అయితే జగన్ తెచ్చిన సచివాలయాల వ్యవస్థ గురించి క్యాడర్ ప్రచారంలో ఎక్కడా చెప్పలేదు అని అంటున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్ లో చూస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు అని సొంత పార్టీ సర్పంచులే ఎక్కడా పనిచేయలేదు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రూరల్ ఓటర్లు మాత్రం జగనే గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు అధికారంలోకి వస్తే పధకాలు ఇస్తారో లేదో అన్న డౌట్లు అయితే వారిలో ఉన్నాయని అంటున్నారు.

ఇలా కనుక విశ్లేషించుకుంటే ఇద్దరి మధ్యన ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అలాగే మైనస్ పాయింట్లు ఉన్నాయి. దాంతో ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం ఎడతెగని చర్చగానే ఉంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే రాజకీయంగానే కాదు సామాజిక వర్గం పరంగానూ విడిపోయిన నేపధ్యం ఉంది. కొన్ని కులాలు ఒక పార్టీకి కొన్ని కులాలు మరో పార్టీకి అన్న విధానం కూడా వచ్చేసింది.

అదే విధంగా చూస్తే ఈసారి మహిళలు పురుషులు అన్న విభజన కూడా ఓటింగులో కనిపిస్తోంది. ఇది కూడా చిత్రంగానే ఉంది. గతంలో అయితే పురుషులు చెప్పినట్లుగా ఇంట్లో మహిళలు ఒకే పార్టీకి ఓటు వేసేవారు. ఇంటి యజమాని మాట వినేవారు. కానీ ఈసారి అలా లేదు. ఒకే కుటుంబం నుంచి వేరు వేరు పార్టీలకు ఓట్లు వెళ్తున్నాయి. మగవారు టీడీపీకి ఎక్కువగా వేస్తే మహిళలు వైసీపీని ఎంచుకుంటే యువత జనసేన అంటున్నారు అన్న టాక్ కూడా ఉంది.

అలా పోలింగ్ సరళిలో కూడా ఈ వర్గాలే ఎక్కువగా కనిపించాయి అని అంటున్నారు. అదే విధంగా మందు బాబులు కూడా ఈసారి కూటమికి ఎక్కువగా ఓటు చేశారు అన్న ప్రచారం సాగుతోంది. తటస్థులు కొత్తగా వచ్చిన ఓటర్లు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎన్నారైలు వీరంతా కూడా టీడీపీ వైసీపీల మధ్య చీలిపోయారు అని అంటున్నారు. ఇలా మొత్తం మీద ఏపీ రాజకీయం నిట్టనిలువునా విభజన జరిగి ఉంది. హోరా హోరీ పోరు సాగింది. దాంతో ఎవరు సీఎం అన్నది ఈవీఎం మిషన్లు మాత్రమే చెప్పాల్సి ఉంది అని అంటున్నారు. తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం దీనికి జవాబు చెప్పలేరనే అంటున్నారు. సో జూన్ 4 వరకూ వెయిట్ చేయాల్సిందే.