Begin typing your search above and press return to search.

'కేసీఆర్ - జగన్'... ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదన్నా!?

అధికారం చేతిలో ఉంది కదా అని, అది శాస్వతం అనే భ్రమలో వెనకా ముందూ చూసుకోకుండా ఎలాపడితే అలా నడుచుకుంటే

By:  Tupaki Desk   |   13 July 2024 4:30 PM GMT
కేసీఆర్ - జగన్... ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదన్నా!?
X

అధికారం చేతిలో ఉంది కదా అని, అది శాస్వతం అనే భ్రమలో వెనకా ముందూ చూసుకోకుండా ఎలాపడితే అలా నడుచుకుంటే... రేపటి రోజున ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయి. ఈ విషయం నేతలకు తెలియంది కాదు కానీ... అధికారం అనే పొరలు కమ్మడం వల్లో ఏమో కానీ ఆ విషయం గుర్తుండదు, ఒకవేళ గుర్తుకు వచ్చినా తామే ఎప్పటికీ అధికారంలో శాస్వతంగా ఉంటామనే అజ్ఞానం పీక్స్ లోకి వెళ్లిపోతుంటుందని అంటారు.

అవును... అధికారంలో ఉండి, అది శాస్వతం అనుకుని భ్రమించి, ఎలా బడితే అలా నడుచుకుని, నియంతల్లా ప్రవర్తిస్తే తర్వాత జరిగే పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయనేది ఇప్పటికే పలుమార్లు ఉదాహరణలు తెరపైకి వచ్చినా నెక్స్ట్ జనరేషన్ నేతలు మరిచిపోతుంటారు. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాజీ ముఖ్యమంత్రుల తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదా అనే ప్రశ్న తలెత్తుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ పూర్తిగా నియంతలా మారిపోయారనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా రేవంత్ రెడ్డిని జైలు పంపించడం, ఆయన కూతురు పెళ్లిలో దారుణంగా అవమానించడం చేశారు! దీంతో... కేసీఆర్ ను ఏనాటికైనా జైలుకి పంపించి, చిప్పకూడు తినిపిస్తానని రేవంత్ ఆ రోజే శపథం చేశారు. కట్ చేస్తే... ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.

రేవంత్ సీఎం పీఠం ఎక్కగానే... ఫోన్ ట్యాపింగ్ కేసు, కాలేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవినీతి వంటి మొదలైన కేసులు సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. దీంతో... వీటిలో ఏ ఒక్క కేసులో అయినా కేసీఆర్ ని రేవంత్ తన హయాంలో జైలుకు పంపడం ఖాయమనే కామెంట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఇక పార్టీ పరంగా అంటే... మరో రెండు వారాల్లో ఆ పనీ పూర్తయిపోద్దని అంటున్నారు.

ఇక ఏపీలో వైఎస్ జగన్ విషయానికొస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు. గత ఎన్నికల్లో 151 స్థానాలు కట్టబెట్టి నెత్తిన పెట్టుకున్న ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఈ స్థాయి ఫలితం జగన్ స్వయంకృతాపరాదం అనే మాటలు వైసీపీ నేతల నుంచే వినిపిస్తున్న పరిస్థితి. వీటితో పాటు ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పేరు చెప్పి చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించారు!

ఇదే సమయంలో నాడు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజుపై రజద్రోహం కేసు పెట్టి అరికాళ్లు వాచిపోయేలా కొట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రఘురామ ఫిర్యాదుతో జగన్ పై తొలికేసు నమోదైంది. అయితే ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అని.. అసలు సిసలు కేసులు ముందు ముందు ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో... జగన్ కు రాజమండ్రి సెంట్రల్ జైల్ ఎక్స్ పీరియన్స్ తప్పకపోవచ్చనే చర్చ నడుస్తోంది.

దీంతో... ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైననూ తప్పదన్నా... అని స్పందిస్తున్నారు పరిశీలకులు.