గత ఎన్నికల్లో బీఆరెస్స్ ఓటమికి కారణం చెప్పిన జగన్!
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవిరామంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 9 May 2024 5:22 AM GMTసార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవిరామంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కూటమికి ఆపోజిట్ గా వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్న జగన్.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ దాదాపు అన్ని నియోజకవర్గాలనూ కవర్ చేస్తూ "సిద్ధం" సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అవును... సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ "...సిద్ధమా?" అంటూ హోరెత్తించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఇందులో భాగంగా... గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆరెస్స్ ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించారు.
వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ కచ్చితంగా గెలుస్తుందని కొంతమంది నమ్మకంగా చెబితే... ఈసారి కాంగ్రెస్ కు ఛాన్స్ ఇస్తారనే కామెంట్లు మరికొందరు చేశారు. అయితే.. సీపీఐ తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో గెలుపొందగా.. బీఆరెస్స్ 39 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీనికి గల కారణాన్ని జగన్ విశ్లేషించారు.
ఇందులో భాగంగా... గత పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి బీఆరెస్స్ పార్టీ సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్లలేకపోయిందని అందుకే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని జగన్ విశ్లేషించారు. ఇదే క్రమంలో... బీఆరెస్స్ కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో ఆ పార్టీని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఏపీలో ప్రజలకు రెండే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పిన జగన్... ఏపీ ప్రజలు విలువలు, విశ్వసనీయతకు ఓటేస్తారా..? అబద్ధాలకు ఓటేస్తారా..? అనేది వారే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో... తెలంగాణలో వైసీపీని విస్తరించే విషయంపైనా జగన్ స్పందించారు.
ఇందులో భాగంగా... తాను పూర్తిగా ఏపీ రాష్ట్రంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు జగన్. ఇదే సమయంలో... తన జీవితం చాలా చిన్నదని, ఈ జీవితకాలంలో ఏపీ ప్రజలకు చిరకాలం మిగిలిపోయేలా సంక్షేమం, అభివృద్ది చేసి జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటే చాలని అన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో చేయాలన్న ఉద్దేశం తనకు లేదని.. కాకపోతే అందరితో సత్సంబంధాలు కొనసాగించాలని తెలిపారు.