జగన్ కాన్ఫిడెన్స్ పీక్స్ లో...అపొజిషన్ తో మైండ్ గేమ్ ...!
ఈ విషయంలో చంద్రబాబు తన అనుకూల మీడియ బలాన్ని ఎప్పటికపుడు ఉపయోగిస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 5 March 2024 11:26 AM GMTరాజకీయాల్లో నవీన తరంలో మైండ్ గేమ్ పాలిటిక్స్ ఎక్కువ అయ్యాయి. రాజకీయంగా గెలిచేస్తున్నామని చెప్పడం ద్వారా యుద్ధానికి ముందే వీక్ చేసి పారేయడం అన్న మాట. ఈ విషయంలో చంద్రబాబు తన అనుకూల మీడియ బలాన్ని ఎప్పటికపుడు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక టీడీపీకి ధీటుగా వైసీపీ కూడా ఇదే మెధడాలజీని ఫాలో అవుతోంది అని అంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు, ఎన్నికలు జరగలేదు. అపుడే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం దాకా వెళ్ళిపోయారు అంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్ లో ఉన్నాయని అంటున్నారు. ఒక విధంగా చూస్తే ఎన్నికలు జస్ట్ లాంచనం మేమే గెలుస్తున్నామని చెప్పడం అన్న మాట.
అలా విపక్ష శిబిరాన్ని డీమోరలైజ్ చేయడమే జగన్ మాటల వెనక కనిపిస్తోంది అని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా చూస్తే దేశంలో ఏ రాజకీయ నేత ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ప్రమాణ స్వీకారం గురించి ఎక్కడా చెప్పలేదు, అంతే కాదు ఎక్కడ నుంచి చేస్తున్నామన్నది అసలు చెప్పలేదు. ఆ విధంగా చూస్తే జగన్ ఈ విషయంలో న్యూ ట్రెండ్ క్రియేట్ చేశారు అని అంటున్నారు.
మరి జగన్ కి ఉన్న ధీమా ఏంటి అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఏపీలో ఏ వర్గం నుంచి చూసినా ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత వినిపిస్తోంది. విపక్షం బలంగా జట్టు కట్టి ముందుకు వస్తోంది. అయినా సరే మేమే మళ్లీ గెలుస్తున్నామని జగన్ చెప్పడం అంటే ఎన్నికల సమరానికి ముందే అపోజిషన్ ని హ్యాండ్స్ అప్ చేయడం అన్న మాట అని అంటున్నారు.
అదే విధంగా జగన్ చెప్పిన సందర్భం కూడా అంతా చూస్తున్నారు. విశాఖ సిటీ తో పాటు విశాఖ జిల్లా అంతా టీడీపీకి కొంత అనుకూలంగా ఉంది. అంతే కాదు ఉత్తరాంధ్రా జిల్లాలు ఏపీ పాలిటిక్స్ లో కీలకంగా మారుతున్నాయి. దాంతో అక్కడ నుంచే నేనే మళ్లీ సీఎం అని జగన్ బిగ్ సౌండ్ చేశారు. ఇది జనాలలో కూడా చర్చకు దారి తీసి అంతిమంగా వైసీపీకి మేలుచేస్తుంది అన్న ఆలోచనతోనే ఇలా చేశారు అని అంటున్నారు.
ఇక తాను అన్ని హామీలు నెరవేర్చాను అని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఆయన చెప్పిన వాటిలో విశాఖ రాజధాని కూడా ఉంది. దాంతో ఆ హామీ విషయంలో తాను కమిట్ అయి ఉన్నాను అని చెప్పుకోవడం కూడా ఈ ప్రకటనతో కనిపిస్తోంది. అలాగే విపక్షానికి విశాఖ మీద ప్రేమ ఉందా లేదా అన్న లిట్మస్ టెస్ట్ నే జగన్ పెట్టారు అని అంటున్నారు.
అలాగే విశాఖ వాసులలో రాజధాని ఆశలను మరోసారి పెంచడం ఏపీకి అమరావతి రాజధాని ఎట్టి పరిస్థితుల్లోనూ సూటబుల్ కాదని తెలియజేయడం కూడా దీని వెనక ఉన్నాయని అంటున్నారు. అమరావతి అన్నది ఖర్చుతో కూడుతున్న వ్యవహారం అని చెప్పడం ద్వారా విపక్షాలు అమరావతి అని చెప్పినా నమ్మవద్దు అన్న సందేశాన్ని అంతర్లీనంగా అందించారు అని అంటున్నారు.
ఇక హైదరాబాద్ మీద ఈ రోజుకీ ఏపీ జనాలకు మోజు ఉంది. అది తమకు దూరం అయింది అన్న ఆవేదన ఉంది. దానిని భర్తీ చేసే సిటీ వైజాగ్ అని సీఎం చెప్పడం ద్వారా తన విజనరీని కూడా చాటుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ విశాఖ రాజధాని ప్రకటన చేయడమే కాదు అందులో ఎన్నో వ్యూహాలను కూడా పొందుపరచారు అని అంటున్నారు. అలాగే తాను విశాఖలోనే నివాసం ఉంటాను అని చెప్పడం ద్వారా విశాఖ వాసిగా క్లెయిం చేసుకున్నారు అని అంటున్నారు.
విశాఖ రాజధాని ఆకాంక్షను అలా ఉత్తరాంధ్రా జనంలో తట్టి లేపారు అని అంటున్నారు అదే విధంగా మళ్ళీ తానే సీఎం సుమా అన్నది అటు జనాలకు ఇటు రాజకీయ జనాలకు జగన్ ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేశారు. ఇక ఇపుడు విపక్షం ఏమి మాట్లాడబోతోంది అన్నది చూడాలి.