Begin typing your search above and press return to search.

లెక్కలతో పక్కా క్లారిటీతో జగన్ !

ఇదిలా ఉంటే పోలింగ్ డే అంతా జగన్ సైలెంట్ గానే గడిపారు. ఆ మరుసటి రోజు మాత్రం ఆయన ట్వీట్ ఒకటి చేశారు

By:  Tupaki Desk   |   16 May 2024 6:30 PM GMT
లెక్కలతో పక్కా క్లారిటీతో జగన్ !
X

జగన్ మొదట బిజినెస్ మ్యాన్. ఆ తరువాత పొలిటీషియన్ గా టర్న్ అయ్యారు. ఆయన విషయంలో ప్రత్యర్ధులు చేసే విమర్శ ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తారు అని. అందులో వాస్తవం లేదని వైసీపీ వర్గాలు కొట్టిపారేస్తాయి. జగన్ ది జనంతో కనెక్ట్ అయ్యే పాలిటిక్స్ అని చెబుతాయి.

ఇదిలా ఉంటే పోలింగ్ డే అంతా జగన్ సైలెంట్ గానే గడిపారు. ఆ మరుసటి రోజు మాత్రం ఆయన ట్వీట్ ఒకటి చేశారు. దాంట్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ధీమాగా చెప్పారు. ఆ తరువాత ఒక రోజు ఆగి విజయవాడలోని ఐ ప్యాక్ టీం ఆఫీసుని సందర్శించారు.

అక్కడ ఆయన చేసిన సంచలన ప్రకటన కాన్ఫిడెన్స్ కే బాప్ అని అంటున్నారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పి ఊరుకోలేదు. ఈసారి మరింత రీ సౌండ్ తో పవర్ ఫుల్ గా వస్తామని చెప్పారు. ఈసారి వైసీపీ విజయాన్ని దేశమంతా చూస్తుంది, షాక్ తింటుంది అని ఆయన అంటూ వచ్చారు.

మరి జగన్ ధీమా వెనక ఉన్న విషయం ఏమిటి. ఆయన అంత సులువుగా అలవోకగా స్టేట్మెంట్స్ ఇవ్వరు. ఆయన ఒక మాట చెప్పినా లేక ఒక స్టేట్మెంట్ ఇచ్చినా దాని వెనక చాలా ఎక్సర్ సైజ్ ఉంటుంది అని అంటారు. మరి జగన్ మూడు రోజుల పాటు అన్ని రకాలైన నివేదికలను తెప్పించుకున్నారని అంటున్నారు.

అదే విధంగా పోలింగ్ సరళి మీద పార్టీ వారితో మాట్లాడారని పోలింగ్ జరిగిన తీరుతో పాటు జనాల రియాక్షన్ వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అన్నీ కలగలిపి ఆయన వైసీపీకే మరోసారి అధికారం అన్న నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు.

అయితే 151 ఎమ్మెల్యే సీట్లు 22 ఎంపీ సీట్లు 2019లో వైసీపీ గెలుచుకుంది. ఈసారి వాటి కంటే ఒకటి ఎక్కువ తప్ప తక్కువ రాదు అని జగన్ నిబ్బరంగా ప్రకటించారు. మరి ఆ నిబ్బరం వెనక ఉన్న లెక్క ఏమిటి అన్న చర్చ సాగుతోంది. అధికారంలోకి రావడం అంటే ఓకే అనుకోవచ్చు. కానీ ఈసారి కూడా మళ్ళీ పాత రికార్డులను నంబర్లను అధిగమించి ముందుకు సాగుతామని జగన్ చెప్పడం అంటే ఆయన లెక్క ఏమిటి అన్నది ప్రత్యర్ధులతో పాటు రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు.

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుని నిజాయతీగా సమీక్షిస్తున్న వారు తటస్థులు రాజకీయ విశ్లేషకులు అంతా చెప్పేది ఏంటి అంటే సైలెంట్ వేవ్ ఉందని. ఆ వేవ్ ఒకవేళ వైసీపీకి బలంగా వీస్తే మాత్రం 130 సీట్ల నుంచి 135 దాకా రావచ్చు అని మాత్రమే. దానికి మించి రావు అన్నది ఒక కచ్చితమైన విశ్లేషణ ఉంది.

అయితే వైసీపీకి 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని జగన్ చెప్పడాన్ని ఎలా చూడాలి అంటే వైసీపీ అధినేత వ్యూహాత్మకంగానే ఈ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. రాజకీయంగా కూడా ఈ స్టేట్మెంట్ ని చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ వద్ద లెక్కలు ఉన్నాయని వాటిని చూసి ఆయన చెప్పి ఉంటారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీలో జూన్ 4న కౌటింగ్ డే. కాబట్టి ఆ రోజున ఈవీఎంలు అసలు విషయాలు చాలా చెబుతాయి అని అంటున్నారు.