Begin typing your search above and press return to search.

జగన్ లైఫ్ స్టైల్ కి ఫ్యాన్స్ & ప్రజానికం ఫిదా.. వీడియో వైరల్!

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్న వైఎస్ జగన్ తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   9 May 2024 6:52 AM GMT
జగన్  లైఫ్  స్టైల్  కి ఫ్యాన్స్  & ప్రజానికం ఫిదా.. వీడియో వైరల్!
X

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్న వైఎస్ జగన్ తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ లైఫ్, తన పబ్లిక్ లైఫ్, ఇంట్లో తన ప్రపంచం, తన ఫోన్, తన ఫొన్ నెంబర్ మొదలైన విషయాలపై ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

అవును... ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్... తాజాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. తనది చిన్న జీవితమని, తనకంటూ ప్రత్యేకించి ప్రైవేట్ లైఫ్ ఏమీ ఉండదని తెలిపారు. ఇదే క్రమంలో... తన పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటేనని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... తనకు తన భార్య వైఎస్ భారతి, తన పిల్లలు అంటే అమితమైన ప్రేమ అని ఈ సందర్భంగా తన అంతరంగాన్ని ఆవిష్కరించిన జగన్... అప్పుడప్పుడు కాస్త సమయం దొరికినప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తూ ఉంటానని తెలిపారు. ఫైనల్ గా ఇదే తన ప్రపంచం అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

అదేవిధంగా... నిత్యం రాజకీయాల్లో తలమునకలయ్యే తనకు ప్రత్యేకంగా స్ట్రెస్ బస్టర్ అంటూ ఏమీ ఉండదని, స్ట్రెస్ ని పెద్దగా తీసుకునే రకంగా కూడా తాను కాదని చెప్పిన జగన్... ప్రార్థన బాగా చేస్తానని, విషయాన్ని దేవుడిని విడిచిపెడతానని.. తర్వాత అన్నీ జరుగుతాయని తెలిపారు.

ఈ సందర్భంలోనే తనకు ఫోన్ లేదని, ఫోన్ నెంబర్ లేదని.. తనకు ఏమైనా అవసరమైతే ఆఫీసులోని ఫోన్ కి కలుపుతారని.. ఇంట్లో వాళ్లు ఏమైనా మాట్లాడాలంటే... తన పీఏలంతా నిత్యం తన చుట్టూనే ఉంటారని జగన్ నవ్వుతూ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జగన్ వ్యాఖ్యలకు ఫ్యాన్స్, ప్రజానికం మరింత ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు!