Begin typing your search above and press return to search.

ఈవీఎంలపై జగన్ ఓల్డ్ వీడియో వైరల్... అస్సలు బాలేదు ఎమ్మెల్యే గారూ!

దీంతో... జగన్ కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఈవీఎంల గురించి స్పందించిన జగన్... "ఈవీఎంలలో 80శాతం జనాభా ఓట్లు వేశారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 7:21 AM GMT
ఈవీఎంలపై జగన్  ఓల్డ్  వీడియో  వైరల్... అస్సలు బాలేదు ఎమ్మెల్యే గారూ!
X

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎం ల ట్యాంపరింగ్, హ్యాకింగ్ కి సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఈవీఎం లు వద్దు - పేపర్ బ్యాలెట్ ముద్దు అంటూ తాజాగా ట్వీట్ కూడా చేశారు. గత కొన్ని రోజులుగా ఇదే విషయంపై అటు వైసీపీ నేతలు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. ఈ సమయంలో జగన్ కే సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... "న్యాయం జరగడం మాత్రమే ముఖ్యం కాదు.. జరిగినట్లు కనిపించాలి కూడా! అదేవిధంగా... ప్రజాస్వామ్యం గెలవడంతోపాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి. ప్రపంచం మొత్తంమీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న దాదాపు ప్రతీ దేశంలో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు.. ఈవీఎంలు కాదు. ప్రజాస్వామ్యం అసలైన స్పూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలి" అని ట్వీట్ చేశారు జగన్.

దీంతో... జగన్ కి సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఈవీఎంల గురించి స్పందించిన జగన్... "ఈవీఎంలలో 80శాతం జనాభా ఓట్లు వేశారు.. అది రికార్డ్. వారంతా పోలింగ్ బూత్ లో బటన్ నొక్కారు. అలా బటన్ నొక్కిన తర్వాత అది ఏపార్టీకి ఓటు వేశారనేది వీవిప్యాట్ లో కనిపిస్తుంది. వారు వేసిన ఓటు, వీవీ ప్యాట్ లో కనిపించినదానికి సరిపోయాయి కాబట్టే వారు సంతృప్తితో బయటకు వచ్చారు. అందుకే వారెవరూ ఫిర్యాదు చేయలేదు" అని అన్నారు.

ఇదే క్రమంలో... "ఒక వేళ నేను ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసినప్పుడు, ఒక వేళ వీవీప్యాట్ లో సైకిల్ గుర్తికి ఓటు వేసినట్లు కనిపిస్తే నేనుందుకు గమ్మునుంటాను.. ఫిర్యాదు చేసేవాడిని కదా..? అలా జరగలేదు కాబట్టే ఎలాంటి కంపలైట్ లూ లేవు.. పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతీ పోలింగ్ బూత్ లోనూ అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లూ కూర్చుంటారు.. వారంతా ఈవీఎంలను చెక్ చేస్తారు.. ఈవీఎంలు వెరిఫై చేశాం.. బాగానే పనిచేస్తున్నాయంటూ సంతకాలు పెడతారు" అని తెలిపారు.

"అలా సంతకాలు పెట్టిన తర్వాతే పబ్లిక్ కి ఓటు వేసేందుకు అనుమతిస్తారు. మరి టీడీపీ ఏంజెంట్లు వెరిఫైడ్ అని సంతకాలు పెట్టినా కూడా ఈవీఎంలలో అది జరిగింది.. ఇది జరిగింది అని చెప్పడం ఎంతవరకూ కరెట్?.. ఇవే ఈవీఎంలు, ఇవే వీవీప్యాట్ లు ఆయనకు అనుకూలంగా ఓట్లు పడితే బాగున్నట్లు.. లేదంటే తప్పు జరిగినట్లు.. ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడే ఈ మనిషి అసలు మనిషేనా అంటున్నా.." అని జగన్ ఫైర్ అయ్యారు.

దీంతో.. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే విషయాన్ని టీడీపీ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా... "151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి, 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు" అని రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు దీనికి సంబంధించిన చర్చ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.