Begin typing your search above and press return to search.

కడప ఎంపీగా జగన్...అసెంబ్లీకి ఇక సెలవ్ ?

వైఎస్ జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ వస్తోంది. జగన్ అయిదేళ్ల పాటు సీఎం గా ఉన్నారు

By:  Tupaki Desk   |   6 July 2024 6:57 AM GMT
కడప ఎంపీగా జగన్...అసెంబ్లీకి ఇక సెలవ్ ?
X

వైఎస్ జగన్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ వస్తోంది. జగన్ అయిదేళ్ల పాటు సీఎం గా ఉన్నారు. నిండు అసెంబ్లీలో 151 సీట్లతో ఆయన తిరుగులేని అధికారం చలాయించారు. అలాంటి చోట కేవలం 11 సీట్లకు అది కూడా ప్రధాన విపక్ష హోదా స్థానం కూడా కోల్పోయి జగన్ అసెంబ్లీకి హాజరైతే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు.

పోనీ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉప నాయకులుగా కొందరిని చేసి తాను తెర వెనక పాత్ర పోషిద్దామనుకున్న అసెంబ్లీలో నోరున్న ఎమ్మెల్యేలు ఎవరూ పెద్దగా లేరు. పైగా నలుగురైదుగురు కొత్త వారు కూడా ఈసారి అసెంబ్లీకి గెలిచారు. దాంతో అసెంబ్లీకి జగన్ తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది.

మరోవైపు చూస్తే అసెంబ్లీలో విపక్ష హోదా ఇవ్వమని స్పీకర్ కి లేఖ రాసినా అది స్పీకర్ విచక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవ్వరనే అంటున్నారు. 18 ఎమ్మెల్యేలు ఉంటేనే తప్ప హోదా దక్కదు. దాంతో జగన్ కి ఏమి చేయాలో పాలు పోవడం లేదు అని అంతా అనుకున్నారు.

కానీ జగన్ ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన చేత రాజీనామా చేయిస్తే ఏ సమస్య ఉండదని లెక్క వేస్తున్నారు. అంతే కాదు ఉప ఎన్నికల్లో తాను సులువుగా గెలవవచ్చు అన్నది జగన్ భారీ ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.

కడపలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వైసీపీకి మంచి మెజారిటీ వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డి మీద వివేకానందరెడ్డి హత్య కేసు ఉంది. దాంతో ఆయన అరెస్ట్ అయితే ఎటూ ఉప ఎన్నికలు తప్పవని అంటున్నారు. దాంతో పాటు వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు అన్నీ కూడా అవినాష్ రెడ్డికి ఎంపీ పదవి ఇవ్వడం వల్లనే వచ్చాయని అంటున్నారు.

ఇలా చాలా సమస్యలకు పరిష్కార మార్గంగా జగన్ కడప ఎంపీ గా పోటీ చేసి గెలవడం అన్నది ఉంటుందని యోచిస్తున్నారు. ఇక అసెంబ్లీలో ఉంటే భారీ ఆధిక్యతతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి పూర్తిగా టార్గెట్ అవడం తప్ప జరిగేది ఏమీ లేదు అని అంటున్నారు. మరీ ముఖ్యంగా అయ్యన్నపాత్రుడుని స్పీకర్ గా జగన్ చూడలేకపోతున్నారు అని అంటున్నారు.

చచ్చే దాకా కొట్టాలి అని ఆయన అన్నట్లుగా వార్తలు వచ్చిన నేపధ్యంలోనే అయ్యన్నను స్పీకర్ గా నియమితులు అయిన కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదని అంటున్నారు. ఇక జగన్ పులివెందుల నుంచి రాజీనామా చేస్తే ఆ సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారు అంటే వైఎస్ విజయమ్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

తన తల్లిని ముందు పెట్టి అసెంబ్లీలో పార్టీని నడిపించాలని చూస్తున్నారు అని అంటున్నారు. విజయమ్మ 2011లో కూడా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇపుడు వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దాంతో విజయమ్మ మరోసారి ఆ బృహత్తర బాధ్యతను భుజాలకెత్తుకోబోతున్నారు అని అంటున్నారు అని అంటున్నారు.

అవినాష్ రెడ్డిని ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తే వైఎస్సార్ కుటుంబం అంతా ఒక్కటిగా ఉంటుంది అని అంటున్నారు. దాంతో విజయమ్మ కూడా పులివెందుల నుంచి పోటీకి సుముఖంగానే ఉంటారు అని అంటున్నారు ఇక జగన్ జాతీయ రాజకీయాల వైపు చూడడానికి మరో కారణం ఉంది అని అంటున్నారు.

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. అయితే టీడీపీ జేడీయూ మద్దతుతోనే ఆ ప్రభుత్వం సాగుతోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం కొంత అస్థిరతతోనే ఉంది. దాంతో జాతీయ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఆ విధంగా చూస్తే లోక్ సభలో నలుగురు ఎంపీలతో రాజ్యసభలో 11 మంది ఎంపీలతో జగన్ అత్యంత కీలకమైన పాత్ర పోషించవచ్చు అని అంటున్నారు. ఆయన వైసీపీ పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరిస్తారు అని అంటున్నారు.

అలా జగన్ ఏపీలో పార్టీని పటిష్టం చేసుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవకాశాలు ఏమైనా ఉంటే వైసీపీ వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మరింతగా రాణించేందుకు అవకాశం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. జగన్ 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కడప ఎంపీగా రెండోసారి గెలిచారు. ఆనాడు ఆయన అయిదున్నర లక్షల మెజారిటీతో రికార్డు క్రియేట్ చేశారు.

ఇపుడు కూడా మంచి మెజారిటీతో గెలవాలని చూస్తున్నారు. మొత్తానికి జగన్ జాతీయ రాజకీయాల మీద ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. అయిదేళ్ల పాటు ఏపీలో ఘోరమైన విపక్ష పాత్ర కంటే అదే నయం అని ఆయ