Begin typing your search above and press return to search.

జగన్ కి ప్రతిపక్ష హోదా...టీడీపీ ఘాటు కౌంటర్

కానీ అసెంబ్లీలో కూడా ఉండలేకపోయారు. ఆయన మొత్తం గంట సేపే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   25 Jun 2024 12:31 PM GMT
జగన్ కి ప్రతిపక్ష హోదా...టీడీపీ  ఘాటు కౌంటర్
X

అధికారం ఆ వైభోగం అలాగే ఉంటుంది. జగన్ కి 151 సీట్లు దక్కి ఎదురులేని విధంగా సభా నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో 11 సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కానీ అసెంబ్లీలో కూడా ఉండలేకపోయారు. ఆయన మొత్తం గంట సేపే అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే తనకు సభా సంప్రదాయం ప్రకారం సీఎం తరువాత ప్రమాణం చేసే చాన్స్ ఇవ్వకుండా ఉల్లంఘించారని జగన్ తాజాగా స్పీకర్ కి రాసిన ఒక లేఖలో ఆక్షేపించారు. అంటే అప్పటికే తనకు విపక్ష నాయకుడి హోదా లేదని నిర్ణయించేసారా అని ఆయన ప్రశ్నించారు.

ఇక సంఖ్యతో సంబంధం లేకుండా విపక్ష హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని జగన్ ఆ లేఖలో కోరారు. అయితే జగన్ కి టీడీపీ మంత్రి సంధ్యారాణి ధీటుగా బదులిచ్చారు. సభా సంప్రదాయాల గురించి మాట్లాడే జగన్ సభలో తన పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్నపుడు అయినా ఉండాలన్న ఆలోచన ఎందుకు లేకుండా వెళ్ళిపోయారని నిలదీశారు.

స్పీకర్ ఎన్నికల వేళ సభా నియమాలు అనుసరించి సభలో ఉండాలని తెలియదా అని ప్రశ్నించారు. మీ గౌరవం గురించి అడుగుతున్నారు కానీ స్పీకర్ కి మీరు గౌరవం ఇచ్చారా అని సంధ్యారాణి జగన్ ని సూటిగా ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నికలు మీరు రాలేదు కానీ సభా సంప్రదాయాల గురించి మాట్లాడమేంటని కూడా ఆమె విమర్శించారు.

పంచభూతాలు సైతం బాధపడేలా అయిదేళ్ళ పాలను చేయడం వల్లనే 151 సీట్ల మధ్యలో 5 ఎగిరిపోయిందని ఆమె ఎత్తి చూపారు. జగన్ విపక్ష హోదా గురించి అడగడం బాగా లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్పీకర్ ఎన్నికకు సభలో ఉండలేదని అలా విపక్ష నేతగా తన బాధ్యతలను పక్కన పెట్టిన జగన్ కి మళ్లీ హోదా గురించి అడగడం ఏ మాత్రం సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా జగన్ లేఖతో మళ్లీ టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న రచ్చ స్టార్ట్ అయింది. దీని మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏమి ఆలోచిస్తారో చూడాలి.