సుదీర్ఘ విదేశీ యాత్రకు జగన్ ప్లాన్ ?
జగన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఒక పదిహేను రోజుల పాటు విదేశీ యాత్ర చేసారు.
By: Tupaki Desk | 20 Aug 2024 8:30 PM GMTజగన్ సుదీర్ఘమైన విదేశీయాత్రకు ప్లాన్ చేశారా అంటే ప్రచారం అయితే ఆ విధంగా సాగుతోంది. జగన్ భారీ ఓటమి నుంచి ఉపశమనం కోసం చూస్తున్నారు అని అంటున్నారు. అందుకోసమే ఆయన లాంగ్ ఫారిన్ ట్రిప్ కి రెడీ అవుతున్నారని అంటున్నారు. జగన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత ఒక పదిహేను రోజుల పాటు విదేశీ యాత్ర చేసారు.
ఆ తరువాత జూన్ 1న ఆయన ఏపీకి వచ్చారు జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి. జగన్ కే కాదు వైసీపీకే భారీ షాక్ ఇచ్చేలా ఈ ఫలితాలు ఉన్నాయి. దాంతో గత రెండున్నర నెలల నుంచి జగన్ తాడేపల్లి టూ బెంగళూరు మధ్యనే షటిల్ సర్వీస్ చేస్తున్నారు.
అలా ఆయన ఎక్కువ సమయం బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. ఇప్పుడు ఆయన ఏకంగా విదేశీ యాత్రకు సిద్ధపడుతున్నారు అని అంటున్నారు. జగన్ సెప్టెంబర్ నెలలో యూకే టూర్ ప్లాన్ చేశారు అని తెలుస్తోంది.
ఈ మేరకు జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన యూకే టూర్ కి అనుమతి కావాలని ఆయన అందులో కోరారు. దీని మీద సీబీఐ కోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అయితే సీబీఐ జగన్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కోరింది.
దాంతో సీబీఐ ఏ విధంగా కౌంటర్ వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. జగన్ కి సీబీఐ కోర్టు అనుమతి ఇస్తే ఆయన సెప్టెంబర్ నెలలో యూకే టూర్ కి వెళ్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జగన్ ఈసారి నెల రోజుల పాటు ఫారిన్ ట్రిప్ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
లాంగ్ ట్రిప్ జగన్ ఎపుడూ వెళ్లలేదు. అయితే వైసీపీ ఓటమి పాలు కావడం పార్టీ పూర్తిగా నిస్తేజంలో ఉండడం కొత్త ప్రభుత్వానికి అవసరమైన టైం ఇవ్వాలని కూడా వైసీపీ ఒక నిర్ణయం తీసుకోవడంతో జగన్ ప్రస్తుతానికి కొంత రిలీఫ్ కోసం ఫారిన్ వెళ్లాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది.
యూకే ట్రిప్ నుంచి వచ్చిన తరువాతనే జగన్ పార్టీ ప్రక్షాళలను మొదలెడతారు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ని భారీ ఓటమి వెంటాడుతోంది అంటున్నారు. ఆయన బెంగళూరు వెళ్ళినా ఇంకా రిలీఫ్ ఫీల్ అవడం లేదని అంటున్నారు. అందుకే ఆయన యూకే ట్రిప్ ని ప్లాన్ చేశారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే సెప్టెంబర్ 3న వైఎస్సార్ వర్ధంతి ఉంది. అది చూసుకుని జగన్ యూకే ట్రిప్ కి వెళ్తారా లేక సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఆయన పర్యటన ఉంటుందా అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి జగన్ ఎపుడూ ఇంత ఖాళీగా లేరు. కాలం ఆయనకు ఈ గ్యాప్ ఇచ్చింది. దానికి ఆయన విదేశీ పర్యటన రూపంలో వాడుకోవాలని అనూంటున్నారు అంటున్నారు.