Begin typing your search above and press return to search.

దసరాకు ఫస్ట్ లిస్ట్...జగన్ రెడీనా...?

మొత్తానికి దసరాకు వైసీపీ రిలీజ్ చేయబోయే ఫస్ట్ లిస్ట్ లో ఎక్కువగా రాయలసీమకు చెందిన సిట్టింగులే ఉంటారని మిగిలిన వాటిలో పక్కాగా గెలిచే కోస్తా జిల్లాల వారు ఉంటారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 2:30 AM GMT
దసరాకు ఫస్ట్ లిస్ట్...జగన్ రెడీనా...?
X

ఏపీలో రాజకీయ సందడి బాగానే సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు ఉన్న తెలంగాణా కంటే కూడా ఏపీ రాజకీయ నేతలే తొందర పడిపోతున్నారు. చంద్రబాబు అయితే గత ఏడాది నుంచి జనంలోనే ఉంటూ వస్తున్నారు. ఇపుడు తండ్రీ కొడుకులు ఇద్దరూ టీడీపీని పైకి లేపాలని చేస్తున్న ప్రయత్నాలతో ఏపీలో అటూ ఇటూ కలియతిరుగుతున్నారు.

జగన్ అయితే పర్యటనలు పెద్దగా పెట్టుకోవడంలేదు. అధికార పార్టీకి ప్రస్తుతానికి ఆ అవసరం లేదని అంటున్నారు. ఆయన జిల్లాలలో జరిగే ప్రారంభోత్సవాలు ఇతర కార్యక్రమాలలోనే మాట్లాడుతున్నారు. మరో వైపు జగన్ పార్టీని సార్వత్రిక ఎన్నికల కోసం సమాయత్తం చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ దసరాకు తొలి దఫా లిస్ట్ ని వైసీపీ ప్రకటిస్తుంది అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

మొత్తం 175 సీట్లలో వివాదం లేనివి, కచ్చితంగా వారికే టికెట్లు దక్కేవి. పోటీ మరొకరు రానివి చూసి మరీ ఒక జాబితాను తయారు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ జాబితాలో 75 పేర్లు ఉంటాయని అంటున్నారు. వీరికి టికెట్లు ఖాయమని చెప్పేయబోతున్నారా లేక అఫీషియల్ గానే రిలీజ్ చేస్తారా అన్నది తెలియడంలేదు.

ఇదిలా ఉంటే తొలి జాబితాలో 75 మంది సిట్టింగులు ఉన్నారు. వారంతా బలమైన నేతలు, మళ్ళీ గెలిచి పార్టీని అధికారంలోకి తెచ్చే దిట్టలుగా భావించే లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక రాయలసీమ నాలుగు జిల్లాలలో చూసుకుంటే సిట్టింగులకు దాదాపుగా అందరికీ టికెట్లు మళ్లీ ఖాయమని అంటున్నారు.

కొంతమంది మీద వేటు పడుతుందని అంతా అనుకుంటున్నా అలాంటిదేమీ ఉండబోదని అంటున్నారు. వారికి టికెట్లు ఇవ్వడమే న్యాయమని పార్టీ హై కమాండ్ భావిస్తోందిట. అంతే కాదు వారిని పక్కన పెట్టి రిస్క్ చేయదలచుకోలేదు అని అంటున్నారు. మరో వైపు చూస్తే సిట్టింగులకు సీట్ల గల్లంతు అన్నది ఎక్కువగా ప్రకాశం నెల్లూరు నుంచి మొదలెట్టి అది కాస్తా గుంటూరు క్రిష్ణా మీదుగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా దాకా పాకించాలని చూస్తున్నారు.

అలా కనుక లెక్క వేసుకుంటే ఒక పాతిక మంది దాకా సిట్టింగులకు ఈ ప్రాంతంలోనే టికెట్లు రాకుండా పోతాయని అంటున్నారు. వారి స్థానంలో కొత్త ముఖాలను తెచ్చి నిలబెట్టాడం ద్వారా గెలుపు పిలుపు అందుకోవాలని చూస్తున్నారుట.

ఇక సీమలో పోటీ ఎపుడూ పార్టీల కంటే వర్గాల మీదనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అందువల్ల అక్కడ టికెట్లు తమ వైపు ఉండే వారికి ఇచ్చుకోవడం ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదే. కోస్తా జిల్లాలలో మాత్రం సీన్ మారుతుంది. రాజకీయాన్నే చూస్తారు. అలాగే అభ్యర్ధుల పనితీరు కొలమానంగా ఉంటుందని అంటున్నారు. దాంతో రిపేర్లు అన్నీ ఇక్కడే అని చెబుతున్నారు.

మొత్తానికి దసరాకు వైసీపీ రిలీజ్ చేయబోయే ఫస్ట్ లిస్ట్ లో ఎక్కువగా రాయలసీమకు చెందిన సిట్టింగులే ఉంటారని మిగిలిన వాటిలో పక్కాగా గెలిచే కోస్తా జిల్లాల వారు ఉంటారని అంటున్నారు. మరి దసరాకే తొలి జాబితా జగన్ ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అది నిజమేనా అలా అయితే ముందస్తు ఎన్నికలు ఏమైనా ఏపీలో జరుగుతాయా అన్న చర్చ కూడా నడుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.