హిందూపురంపై జగన్ మార్క్ పాలిటిక్స్... ఏం జరుగుతోందంటే!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోటల వంటి నియోజకవర్గా లపై కన్నేశారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించాలనేది వైసీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 6 Sep 2023 2:15 PM GMT'వైనాట్ 175' నినాదాన్ని వైసీపీ నాయకులు ఎంత మంది గుర్తు పెట్టుకున్నారో తెలియదు కానీ, సీఎం జగన్ మాత్రం దానిని కలలో కూడా మరిచిపోయినట్టు కనిపించడం లేదు. ఈ క్రమంలో వైసీపీకి పట్టున్న నియోజ కవర్గాల్లో మరింత పట్టు బిగిస్తూనే.. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కంచుకోటల వంటి నియోజకవర్గా లపై కన్నేశారు. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించాలనేది వైసీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇలాంటి నియోజకవర్గాల్లో కీలకమైంది హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్. గత ఎన్నికల్లోనూ అంతకు ముందు కూడా నందమూరి బాలకృష్ణ ఇక్కడ వరుస విజయాలు దక్కించుకున్నారు. వాస్తవానికి బాలయ్య అంటే.. సినిమాల పరంగా సీఎం జగన్ ఎంతో అభిమానిస్తారని, ఆయన అభిమాన సంఘానికి నాయకుడని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అదే అభిమాన హీరోకు రాజకీయంగా చెక్ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నిన్నటి వరకు ఒక రాజకీయం, నేడు మరో రాజకీయం అన్నట్టుగా వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2014లో నవీన్ నిశ్చల్ పోటీ చేసి బాలయ్యపై ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల నాటికి ఆయనను తప్పించి మాజీ ఐపీఎస్, మైనారిటీ నాయకుడు ఇక్బాల్‌ను తెచ్చి టికెట్ ఇచ్చారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వీచినా.. ఈయన మాత్రం ఓడిపోయాడు.
ఇక, వచ్చే ఎన్నికల నాటికి.. ఈ ఇద్దరినీ నిలబెట్టినా ప్రయోజనం లేదని భావించిన సీఎం జగన్.. దీపిక అనేక మహిళకు అవకాశం ఇచ్చారు. స్థానికంగా కురబ సామాజిక వర్గానికి చెందిన దీపికకు మంచి ఫాలో యింగ్ ఉంది. దీనిని అవకాశంగా మార్చుకున్న సీఎం జగన్... అటు ఇక్బాల్, ఇటు నవీన్ నిశ్చల్‌లను కూడా రంగంలోకి దింపి, దీపిక గెలుపునకు ప్రయత్నం చేయాలని.. అందరూ కష్టపడితే గెలుపు సాధ్యమే నని తనదైన శైలిలో నూరిపోశారు. దీంతో అందరూ ఇప్పుడు ఏకతాటిపై నిలిచి హిందూపురంలో వైసీపీ కోసం పని ప్రారంభించారు.
వైసీపీ ప్లస్‌లు
+ సంక్షేమ పథకాల అమలు
+ నవీన్, ఇక్బాల్ వర్గాలు కలిసి రావడం
+ బాలయ్య స్థానికంగా ఉండకపోవడం
+ దీపిక స్థానిక బలమైన కురబ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం
వైసీపీకి మైనస్‌లు
+ బలమైన బాలయ్య చరిష్మాను తట్టుకోవడం
+ నందమూరి కుటుంబానికి కంచుకోట వంటి నియోజకవర్గం కావడం