మోడీ బాధితులను ఒక్క చోటకు చేర్చిన జగన్!
కానీ.. ఇలా వచ్చిన వారంతా.. వారి ఉద్దేశం వేరేగా ఉంది. సంజయ్ రౌత్ అయినా.. అఖిలేష్ యాదవ్ అయినా.. ఇతర నేతలైనా.. అందరూ మోడీ బాధితులే.
By: Tupaki Desk | 24 July 2024 1:30 PM GMTవైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో చేపట్టిన ధర్నా.. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ఉద్యమిం చేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫొటో గ్యాలరీ సహా.. వీడియోలు కూడా ప్రదర్శించారు. అయితే.. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రానికి చెందిన పార్టీలు దూరంగా ఉన్నా.. కొన్ని ఉత్తరాది పార్టీలు మాత్రం మద్దతు ప్రకటించాయి.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని కొందరు నాయకులు కూడా.. జగన్ ధ ర్నాలో పాల్గొన్నారు. ఏపీలో జరుగుతున్న హత్యా రాజకీయాలను వారు ఖండించారు. హత్యా రాజకీ యాలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని చెప్పారు. సంజయ్ రౌత్ సహా ఎంపీ అరవింద్ సావంత్ వంటివారు బలమైన గళమే వినిపించారు. రాష్ట్రంలో(ఏపీ) అరాచక పాలన సాగుతోందని.. అక్కడ ప్రభుత్వం కొనసా గేందుకు అర్హత లేదన్నారు.
అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఒక్క ఏపీలోనే కాదు.. తమిళనాడు సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందన్నారు. కేంద్రం మొద్దు నిద్ర పోతోందని.. ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. శాంతి భద్రతల వ్యవహారం.. రాష్ట్రాల సబ్జెక్టే అయినా.. కేంద్రం జోక్యం చేసుకుని ఆయా రాష్ట్రాలకు కేంద్ర బల గాలను, ప్రతినిధి బృందాలను పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఏం జరుగుతోందో తెలుసుకోవా లన్నా.. ఏపీని పట్టించుకోకపోతే.. మరో మణిపూర్ అవుతుందన్నారు.
కానీ.. ఇలా వచ్చిన వారంతా.. వారి ఉద్దేశం వేరేగా ఉంది. సంజయ్ రౌత్ అయినా.. అఖిలేష్ యాదవ్ అయినా.. ఇతర నేతలైనా.. అందరూ మోడీ బాధితులే. మోడీపై ఉన్న ఆగ్రహంతోనే వారు.. ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. అందుకే ఎక్కువగా మోడీ సర్కారును వారు కార్నర్ చేస్తూ వచ్చారు. ఇక్కడ మరో చిత్రం ఉంది. గతంలో వీరంతా చంద్రబాబుతో కలిసి పనిచేశారు. దీంతో ఎవరూ చంద్రబాబును నేరుగా పేరు పెట్టి విమర్శలు చేయక పోవడం గమనార్హం. అంటే.. ఒకరకంగా జగన్ చంద్రబాబు వ్యతిరేకులను ఒకే వేదికపైకి తీసుకురావాలని అనుకున్నా.. కేవలం మోడీ వ్యతిరేకులు మాత్రమే క్యూ కట్టడం గమనార్హం.