Begin typing your search above and press return to search.

వినుకొండ ఘటనపై స్పందించిన జగన్... కార్యకర్తల కామెంట్స్ వైరల్!

ఈ సమయంలో నిందితుడు టీడీపీ కార్యకర్త, బాధితుడు వైసీపీ కార్యకర్త అంటూ వైసీపీ ఆన్ లైన్ వేదికగా స్పందించగా... కాదు ఇద్దరూ వైసీపీకి చెందిన వారే అని టీడీపీ ట్వీట్ చేసింది.

By:  Tupaki Desk   |   18 July 2024 6:38 AM GMT
వినుకొండ ఘటనపై స్పందించిన జగన్... కార్యకర్తల కామెంట్స్  వైరల్!
X

పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం రాత్రి అత్యంత పాశవికమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘోరానికి పాల్పడిన వ్యక్తి ఏ పార్టీకి చెందినవారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే... జరిగిన ఘోరం మాత్రం అత్యంత భయానకంగా ఉందనే చెప్పాలి! ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

ఈ సమయంలో నిందితుడు టీడీపీ కార్యకర్త, బాధితుడు వైసీపీ కార్యకర్త అంటూ వైసీపీ ఆన్ లైన్ వేదికగా స్పందించగా... కాదు ఇద్దరూ వైసీపీకి చెందిన వారే అని టీడీపీ ట్వీట్ చేసింది. అసలు వారు ఏపార్టీకి చెందినవారు అనే సంగతి పక్కనపెడితే... ఇది అత్యంత హేయమైన, ఘోరమైన, పాశవికమైన చర్య అని అంటూ స్పందిస్తున్నారు ప్రజానికం. ఈ సమయంలో జగన్ స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

అవును... వినుకొండలో జరిగిన పాశవిక ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని.. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడా కనిపించడమే లేదని.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలోనే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అన్నారు.

ఇదే క్రమంలో... కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ఫైర్ అయ్యారు. ఇక, నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని చెప్పిన జగన్... నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.

ఇదే సమయంలో... ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు.. రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు జగన్. ఇదే క్రమంలో... ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. పోలీసు యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని.. ఫలితంగా నేరగాళ్లు, హంతకులూ చెలరేగిపోతున్నారని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా అధికారం శాస్వతం కాదని, హింసత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పిన జగన్... రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పరిస్థితులపై దృష్టి పెట్టాలని మోడీ, అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు అహ్దీర్యపడోద్దని భరోసా ఇచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే... జగన్ ఇలా ఎక్స్ వేదికగా రియాక్ట్ అవ్వడంపై సగటు వైసీపీ కార్యకర్త కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా... "నీ కాళ్లు పట్టుకుంటాను.. కనీసం ప్రెస్ మీట్ అయినా పెట్టన్నా" అని ఒకరు కామెంట్ చేస్తే... "తొందరగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అంతక్రియలు చేయించు అన్న.. అప్పుడు క్యాడర్లో బలం వస్తుంది.. ధైర్యం వస్తుంది" అని మరొకరు స్పందించారు.