జగన్ రేవంత్ కలిసే ముహూర్తం ఫిక్స్....!?
తెలంగాణా ఆంధ్రా సీఎంలు ఇద్దరూ కలిసే ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. తొందరలోనే ఇది జరుగుతుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2023 1:30 AM GMTతెలంగాణా ఆంధ్రా సీఎంలు ఇద్దరూ కలిసే ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. తొందరలోనే ఇది జరుగుతుంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఏపీలో టూర్ చేయనున్నారు. ఆయన ఈ సందర్భంగా డైరెక్ట్ గానే విజయవాడకు ల్యాండ్ అవుతారు అని తెలుస్తోంది. విజయవాడలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారిని రేవంత్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అని అంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే అది తెలంగాణా పీసీసీ చీఫ్ హోదాలోనే జరిగింది. కాంబట్టి పెద్దగా రాజకీయ ఆసక్తులు ఎవరికీ లేవు. కానీ ఇపుడు రేవంత్ రెడ్డి సీఎం హోదాలో వస్తున్నారు. అది కూడా ముఖ్యమంత్రి జగన్ ఉంటున్న గుంటూరు కి సమీపంలోనే ఆయన ఆధ్యాత్మిక టూర్ ఉండబోతోంది.
దాంతో జగన్ తో రేవంత్ భేటీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతా అంటున్నారు. ఇద్దరు తెలుగు సీఎంలు కలసి అనేక విషయాలను ముచ్చటించుకుంటారు అని అంటున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద చర్చిస్తారు అని అంటున్నారు. వచ్చే వారమే రేవంత్ కుటుంబ సమేతంగా విజయవాడ అమ్మ వారి దర్శనానికి వస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇద్దరు సీఎంలు రెండు రాష్ట్రాల మధ్య సహకారం కావాలని ఆకాంక్షించారు. రేవంత్ సీఎం అయిన సందర్భంగా జగన్ ఇరు రాష్ట్రాలు కలసి సాగాలని కోరితే రేవంత్ సైతం దానికి పాజిటివ్ గా రిప్లై ఇచ్చారు. ఇక జగన్ విషయం తీసుకుంటే గతంలో తెలంగాణా సీఎం కేసీయార్ తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఇపుడు రేవంత్ తో అదే కోరుకుంటున్నారు అని అంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి టూర్ కి సంబంధించి డేట్ ఫిక్స్ అయితే కచ్చితంగా జగన్ తో రేవంత్ భేటీ ఉండే చాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నట్లుగా తెలుతోంది. ఇక ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్ళకు దగ్గర పడుతోంది. మరో ఆరు నెలల వ్యవధిలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి కూడా ముగియనుంది. వీటితో పాటు రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. అలాగే ఆస్తుల విభజన ఉంది. ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి కూర్చుని చర్చించుకోవాల్సి ఉంది.
దాంతో పాటు జగన్ కూడా పొరుగు రాష్ట్రాలతోనూ కేంద్రంతోనూ సఖ్యతగా మెలగడం ద్వారానే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుందని నమ్ముతున్నారు. దాంతో తెలంగాణాకు కొత్త సీఎం రాగానే అభినందనలు తెలిపి స్నేహ హస్తం చాచారు. ఇపుడు రేవంత్ ఏపీకి వస్తే కచ్చితంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఉండే చాన్స్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.