12 ని 11 చేసి జగన్ పై నెట్టింట ట్రోలింగ్!
ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. దీంతో... జగన్ ను వైసీపీని మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
By: Tupaki Desk | 24 Feb 2025 7:12 AM GMTఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. అనంతరం.. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసగించారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. దీంతో... జగన్ ను వైసీపీని మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
అవును... ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా.. గత ప్రభుత్వం అన్ని రకాలుగానూ వైఫల్యం చెందిందని.. తమ ప్రభుత్వం అన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. ఈ సమయంలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్ కాట్ చేసింది.
గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే... అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌంట్ చేశారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే వెళ్లిపోయారు!
ఆ సంగతి అలా ఉంటే... ఏపీ అసెంబ్లీకి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జగన్ రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా సభలోకి వెళ్లిన జగన్ అండ్ కో... బ్లాక్ నెంబర్ 11 లో కూర్చున్నారని తెలుస్తోంది! ఇలా బ్లాక్ నెంబర్ 11 అని రాసి ఉన్న చోట జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొలువుదీరడంపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి!
ఇందులో భాగంగా.. వైఎస్ జగన్ అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలతో 11వ నెంబర్ బ్లాక్ లో కూర్చున్నారంటూ ఆ ఫోటోను షేర్ చేస్తూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే... వాస్తవానికి జగన్ & కో అసెంబ్లీలో కూర్చున్నది బ్లాక్ నెంబర్ 12 లో కావడం గమనార్హం. అయితే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా 12 ని 11 గా మార్చి ట్రోల్స్ చేస్తున్నారు!
మరోపక్క అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేసిన తర్వాత.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత జగన్ కాసేపట్లో భేటీ కానున్నారని తెలుస్తోంది. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యలయంలో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్ధేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు చేయనున్నారని తెలుస్తోంది!