Begin typing your search above and press return to search.

దూరంగా జరుగుతూ జగన్ సంచలన నిర్ణయం ?

అయితే ఈసారి జగన్ దీర్ఘకాలం పాటు విదేశీ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 3:30 PM GMT
దూరంగా జరుగుతూ  జగన్ సంచలన నిర్ణయం ?
X

వైసీపీ అధినేత జగన్ ని ఓటమి ఒక్క లెక్కన ఉండనీయడం లేదు. ఆయన తాడేపల్లికి చుట్టపు చూపుగానే వచ్చి పోతున్నారు. ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. అయితే ఈసారి జగన్ దీర్ఘకాలం పాటు విదేశీ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ప్రచారం అయితే సాగుతోంది.

లండన్ లో జగన్ ఇద్దరు కుమార్తెలు చదువుతున్నారు. సీఎం గా బిజీగా ఉన్నప్పటికీ జగన్ దంపతులు ప్రతీ ఏటా లండన్ వెళ్తూ వచ్చారు. ఇక ఎన్నికలు ముగిసి ఫలితాలు రాకముందు జగన్ విదేశీ యాత్ర చేపట్టారు. జూన్ 2న ఆయన తిరిగి ఏపీకి చేరుకున్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరోసారి విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన జగన్ కి కలిగిందని ప్రచారం సాగుతోంది.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కి హానీమూన్ పీరియడ్ సాగుతోంది. ప్రజలు కూడా కూటమి వైపే చూస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఇంకా తాము పోరాటానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి వారు అయితే కూటమికి కనీసంగా ఏడాది పాటు టైం ఇవ్వాలని అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఏపీలో ఉండి చేసేది లేదని భావించి జగన్ బెంగళూరుకు తరచూ వెళ్తున్నారు అని అంటున్నారు. ఇక బెంగళూరు నుంచి కూడా లండన్ వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్ దంపతులు తమ పాస్ పోర్టులను రెన్యూవల్ చేయించుకున్నారని అంటున్నారు.

జగన్ విదేశీ యాత్ర చేయాలంటే కచ్చితంగా కోర్టు అనుమతి ఇవ్వాలి. మరి జగన్ కి రెండు నెలల క్రితమే పదిహేను రోజుల పాటు విదేశీ యాత్రకు అనుమతి సీబీఐ కోర్టు ఇచ్చింది. మరోసారి అంటే ఇస్తుందా లేదా అన్నది చర్చగా ఉందిట. అయితే కోర్టు ఇస్తుందని భావించే జగన్ లండన్ టూర్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని అంటున్నారు.

లండన్ లో కొంతకాలం గడిపి ఓటమి నుంచి పూర్తి స్థాయిలో తేరుకుని ఏపీకి తిరిగి రావాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈ లోగా ఏపీ రాజకీయాల మీద ఫుల్ క్లారిటీ వస్తుందని కూడా తలపోస్తున్నారుట. ఏపీలో అధికార కూటమి మీద ఏ కాస్తా వ్యతిరేకత వచ్చినా దానిని అందుకుని జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు.

అయితే కనీసంగా ఆరు నెలల సమయం అయినా దానికి పడుతుందని అంటున్నారు. ఇంకా బిగిసి రెండు నెలలే అయింది. ఇక మరో వైపు అధికార కూటమి గత అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ జనంలో దోషిగా నిలబెడుతోంది. అంతే కాదు వీటిని అడ్డం పెట్టుకుని చర్యలకు దిగుతోంది.

ఏ విధంగా చూసినా రాజకీయ వాతావరణం పూర్తి ప్రతికూలంగా ఉండడంతో కొన్నాళ్ల పాటు లండన్ లో ఉండడం బెస్ట్ అని జగన్ భావిస్తున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మొత్తం మీద చూస్తే జగన్ తాడేపల్లి టూ లండన్ వయా బెంగళూరు గా టూర్ ని డిజైన్ చేసే పనిలో ఉన్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ అధినేత ఏపీకి దూరంగా దేశానికే దూరంగా ఉంటే అది వైసీపీకి ఎంత వరకూ లాభం చేస్తుంది ఎంత వరకూ చేటు తెస్తుంది అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.