Begin typing your search above and press return to search.

వారసులకు ఓకే అన్న జగన్...!

వైసీపీలో యూత్ ఎపుడూ ఎక్కువ నంబరే ఉంటారు. దానితో పాటుగా కొందరు సీనియర్ నేతల మాటను మన్నించి వారి వారసులకు ఈసారి ఇంచార్జిల రూపంలో టికెట్లు జగన్ ఇవ్వడం విశేషం.

By:  Tupaki Desk   |   2 Jan 2024 11:30 PM GMT
వారసులకు ఓకే అన్న జగన్...!
X

వైసీపీలో యూత్ ఎపుడూ ఎక్కువ నంబరే ఉంటారు. దానితో పాటుగా కొందరు సీనియర్ నేతల మాటను మన్నించి వారి వారసులకు ఈసారి ఇంచార్జిల రూపంలో టికెట్లు జగన్ ఇవ్వడం విశేషం. ఏకంగా నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల బిడ్డలకు జగన్ టికెట్లు ఇచ్చారు. గుంటూరు ఈస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా షేక్ ఉండగా ఆయన కుమార్తె షేక్ నూరీ ఫాతిమాకు జగన్ టికెట్ ఇచ్చారు.

అలాగే మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పేర్ని నాని ఉంటే ఆయన కుమారుడు పేర్ని క్రిష్ణమూర్తికి టికెట్ ఇచ్చారు. ఇక తిరుపతి ఎమ్మెల్యేగా సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఉన్నారు. ఆయన కుమారుడు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన భూమన అభినయ్ రెడ్డి కి టికెట్ ఇచ్చారు. అలాగే చంద్రగిరి నుంచి వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కి జగన్ ఇంచార్జిలుగా ఇచ్చారు.

దీంతో వారసులు ఈసారి వైసీపీ తరఫున తొలిసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లుగా ఉంది. ఇక చాలా మంది సీనియర్లు తమ కుమారులకు టికెట్లు కోరుతున్నారు. అందులో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన క్రిష్ణ దాస్, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాలనాయుడు వంటి వారు ఉన్నారు.

అలాగే అమలాపురం నుంచి మంత్రి పినిపె విశ్వరూప్ కూడా తన కుమారుడికి టికెట్ కోరుతున్నారు. కర్నూల్ నుంచి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చిత్తూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వారసులకు టికెట్ కోరుతున్నారు. ఇలా లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంది. అయితే జగన్ ఈ వారసులకు టికెట్లు ఇచ్చారు కాబట్టి మిగిలిన వారి విషయంలో ఏమైనా పరిశీలన చేస్తారా లేదా అనంది చూడాల్సి ఉంది అని అంటున్నారు.