పోతిన మహేష్ కి జగన్ ఇచ్చిన హామీ అదేనా.. !?
అయితే ఆయన భవిష్యత్తుకు తాను హామీ అని జగన్ చెప్పారని అంటున్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాగానే మహేష్ కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు.
By: Tupaki Desk | 11 April 2024 3:54 AM GMTరాజకీయ రాజధాని విజయవాడలో జనసేన ముఖ్య నేత పెద్ద గొంతు కలిగిన బీసీ నాయకుడు పోతిన మహేష్ ఆ పార్టీకి దూరం కావడం అంటే ఒక విధంగా నష్టంగానే భావించాలి. నాయకులు అంత సులువుగా తయారు కారు. అలా తయారు చేసుకున్న వారిని కాపాడుకోవడం పార్టీలకు అతి ముఖ్య కర్తవ్యం కావాలి. పోతిన మహేష్ జనసేనలో ఉండడం ఆ పార్టీకే రాజకీయ లాభం. ఆయన వెళ్లిపోతే ఆయనకంటూ లిఫ్ట్ వేరే చోట దొరుకుతుంది. కానీ మరో నేత అక్కడ ఆ స్థాయిలో దొరకం జనసేన వంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న పార్టీకి కష్టం.
ఇదిలా ఉంటే పోతిన మహేష్ ఒంగోలు జిల్లాలోని గంట వారి పాలెం వెళ్లి మరీ వైసీపీలో చేరారు. ఆయనను జగన్ కౌగలించుకుని మరీ భుజం తట్టారు. మరి పోతిన మహేష్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆయన జనసేనలో ఉన్నపుడు వైసీపీని పదునైన మాటలతో చీల్చిచెండాడారు. అటువంతి మహేష్ వైసీపీలో వెళ్లారు అంటే ఏమి హామీ పొంది ఉంటారు అన్నది అందరిలోనూ కలిగే డౌట్.
అయితే ఆయన భవిష్యత్తుకు తాను హామీ అని జగన్ చెప్పారని అంటున్నారు. మరోసారి వైసీపీ ప్రభుత్వం రాగానే మహేష్ కి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు. అంటే ప్రస్తుతం పార్టీలు మారిన వారు చాలా మంది సీట్లు ఖాళీలు అవబోతున్నాయి. వాటిలో ఒక దానిని మహేష్ కి ఇస్తారు అని అంటున్నారు. మహేష్ ని పార్టీలోకి తీసుకున్నారు ఆయన వల్ల కూడా రాజకీయ లాభం ఉండాలి కదా అన్నది మరో చర్చ.
మరి ఆయనకు ఇచ్చిన టాక్స్ ఏంటి అంటే విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బిగ్ షాట్ సుజనా చౌదరిని ఓడించాలి. ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ. అలాగే మైనారిటీలు ఎక్కువ. ఈ రెండూ కలిస్తే వైసీపీ విజయం ఖాయం. పైగా ఇక్కడ టీడీపీ గెలిచింది ఎపుడూ లేదు. బీజేపీకి ఆశలు కూడా లేవు.
ఇవన్నీ తీసుకునే పోతిన మహేష్ ని ఫ్యాన్ పార్టీలోకి ఆహ్వానించారు అని అంటున్నారు. ఆయన సుజనా చౌదరిని ఓడించే విషయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడితే కనుక కచ్చితంగా ఆయనకు వైసీపీలో మంచి ప్లేస్ ఉంటుందని అంటున్నారు. అలా పోతిన మహేష్ ముందు ఒక భారీ ఆఫర్ తో పాటు ఒక బిగ్ టాస్క్ కూడా ఉందని అంటున్నారు. చూడాలి మరి విజయవాడ పశ్చిమలో ఏమి జరుగుతుందో. మరో ట్విస్ట్ కూడా ఇదే నియోజకవర్గంలో చోటు చేసుకుంటుంది అని అంటున్నారు. టీడీపీ నుంచి కూడా కీలక నేతలను ఆకట్టుకుని వైసీపీలో చేర్చుకుంటారు అని అంటున్నారు. చూడాలి మరి.