Begin typing your search above and press return to search.

జగన్ ట్వీట్ : అభిమన్యుడు కాదు నేను అర్జునుడిని

మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తన సన్నద్ధతను జగన్ చాటాడు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:02 PM GMT
జగన్ ట్వీట్ : అభిమన్యుడు కాదు నేను అర్జునుడిని
X

'ఎన్నికల మహా సంగ్రామంలో పచ్చ మంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడిని కాదు... అర్జునుడిని' అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్ కలకలం రేపుతున్నది.

మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తన సన్నద్ధతను జగన్ చాటాడు. ఎక్స్ వేదికగా తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఈ అర్జునుడికి కృష్ణుడి వంటి నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తోడుగా ఉన్నారు ఈ యుద్ధంలో విజయం మనదే అని జగన్ పేర్కొన్నాడు.

"కూటమి వ్యూహాల్లో, కుట్రల్లో, కుతంత్రాల్లో, మోసపూరిత వాగ్దానాల్లో... వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం ఉన్నది. కానీ, ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. అర్జునుడు. ఈ అర్జునుడికి ప్రజల అండ, దేవుడి దయ తోడుగా ఉన్నాయి. అందుకే మీ బిడ్డ ఇలాంటి పద్మవ్యూహాలకు భయపడడు. మీ అండదండలు ఉన్నంతకాలం మీ బిడ్డ తొణకడు" అని జగన్ వెల్లడించడం విశేషం.