పులివెందుల ఎమ్మెల్యే...ర్యాంగింగ్ వేరే లెవెల్ లో ?
23 సీట్లు టీడీపీ గెలుచుకుంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ప్రతీ దానికీ 23 ని ముడి పెట్టి వైసీపీ ర్యాగింగ్ చేసిన కధ నిన్నటిది.
By: Tupaki Desk | 11 July 2024 4:10 AM GMTరాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. అయితే అవి హద్దులు ఎపుడో దాటి పోయాయి. గెలిచిన వారు హుషార్ ఒక్క లెక్కన ఉంటుంది. ఓడిన వారిని వారు పొలిటికల్ ర్యాగింగ్ చేస్తూనే ఉంటారు. అది వారు అయినా వీరు అయినా ఒక్కటే. 23 సీట్లు టీడీపీ గెలుచుకుంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ ప్రతీ దానికీ 23 ని ముడి పెట్టి వైసీపీ ర్యాగింగ్ చేసిన కధ నిన్నటిది.
ఇపుడు 11 సీట్లు తెచ్చుకున్న వైసీపీకి కూడా అలాగే ర్యాగింగ్ చేస్తున్నారు. ఇక జగన్ ని అయితే పులివెందుల ఎమ్మెల్యే అని కూడా కొత్తగా పేరు పెట్టి మరీ ర్యాగింగ్ స్టార్ట్ చేసారు. జగన్ సొంత జిల్లా కడపలో కడప అసెంబ్లీ సీటు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి జగన్ జస్ట్ తన లాగానే ఒక ఎమ్మెల్యే అని అన్నారు కూడా.
ఇక చాలా మంది కూడా జగన్ని పులివెందుల ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు. చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేత పత్రం రిలీజ్ చేసిన సందర్భంగా ఈ ప్రస్తావన వచ్చింది. పులివెందుల ఎమ్మెల్యే అని మీడియా కూడా ప్రశ్నిస్తూ బాబుని జగన్ చేస్తున్న హెచ్చరికల మీద కామెంట్స్ కోరారు.
దానికి బాబు కూడా పులివెందుల ఎమ్మెల్యే అంటూనే జగన్ పేరు ఎత్తకుండా బదులు ఇచ్చారు. అంటే జగన్ ని పులివెందుల ఎమ్మెల్యేగానే ఇక మీదట పిలవాలని టీడీపీ డిసైడ్ అయిందా అన్న చర్చ వస్తోంది. జగన్ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఈ ర్యాంగింగ్ ని స్టార్ట్ చేశారు అని అంటున్నారు.
ఇది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార ఘట్టం నుంచే మొదలైంది అని అంటున్నారు. జగన్ ని కూడా ఎమ్మెల్యేనే అక్షర క్రమంలో ఆయనను పిలిస్తే చివరాఖరున ప్రమాణం చేయాల్సి వచ్చేది. కానీ చంద్రబాబు ఆలోచించి ఆయనకు మంత్రుల తరువాత స్థానం ఇచ్చారు అని టీడీపీ మంత్రులు నాయకులు కూడా ఆ తరువాత చెప్పడం అంతా చూసారు.
తనకు ప్రతిపక్ష హోదా కావాలని జగన్ స్పీకర్ కి లేఖ రాయడం జరిగింది. అయితే స్పీకర్ అలా ఇస్తారా అంటే ప్రస్తుతానికి ఎవరూ జవాబు చెప్పలేరు. అదే సమయంలో జగన్ ని ఎమ్మెల్యేగానే పిలవడం ద్వారా ఆయన ఒక మెంబర్ మాత్రమే అని చెప్పడం జరుగుతోందని అంటున్నారు.
అయితే జగన్ అయిదేళ్ళ పాటు ఏపీని పాలించిన సీఎం. అలా ఆయన మాజీ సీఎం గా ఉంటారు. ఎవరైన ఒక మంత్రి ఓటమి పాలు అయితే మాజీ మంత్రి అని అంటారు తప్ప జస్ట్ ఎమ్మెల్యే అని అనరు. దాంతో పాటు వైసీపీ పార్టీ అధినేత. ఆ పార్టీకి శాసనమండలిలో ప్రతిపక్ష హోదా ఉంది. పార్లమెంట్ లో 15 మంది ఎంపీలు ఉన్నారు. నలభై శాతం ఓటు షేర్ ఉంది.
మరి నిన్నటి దాకా సీఎం గా ఉన్న వారు ఈ రోజు జస్ట్ ఎమ్మెల్యే ఎలా అంటే వైసీపీని నైతికంగా దెబ్బ తీసే వ్యూహంలో భాగంగానే అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మొత్తం మీద అధికారంలో ఉన్నపుడు రకరకాల పేర్లలో జగన్ ని పిలిచారని ఇపుడు జగన్ కి కొత్త పేరు పెట్టారని అంటున్నారు. మరి ఆయన దీనిని ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.