Begin typing your search above and press return to search.

రెడ్ల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన జ‌గ‌న్‌.. ఈ సారి హైఓల్టేజీ.. !

ప్రస్తుతం శాసనమండలిలో విపక్ష నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పక్కకు తప్పించి ఆస్థానంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను నియమించారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 8:30 PM GMT
రెడ్ల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన జ‌గ‌న్‌.. ఈ సారి హైఓల్టేజీ.. !
X

వైసీపీ అధినేత జగన్.... రెడ్డి సామాజిక వర్గానికి మరోసారి భారీ షాకిచ్చారు. ఇది హైఓల్టేజ్ రేంజ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం శాసనమండలిలో విపక్ష నాయకుడిగా ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పక్కకు తప్పించి ఆస్థానంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణను నియమించారు. బొత్స సత్యనారాయణ సీనియర్ నాయకుడే అయినప్పటికీ ఇప్పటికే తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమను పట్టించుకోవడం లేదని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డిని తప్పించడం ఆ వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది.

వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. ఆయన వెంటే గత పది ఏళ్ల‌ పాటు నడిచింది. అయితే వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ తన స్టాండ్ మార్చుకుని ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో రెడ్డి సామాజిక వర్గం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని తమను అసలు పట్టించుకోవడం లేదనీ వారు అనేక సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ జగన్ తాను తీసుకుని నిర్ణయానికి కట్టుబడ్డారు.

ఫలితంగా రెడ్డి సామాజిక వర్గం జగన్ను దూరం చేసింది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీగా పడింది. రెడ్డి సామాజిక వర్గం అండ లేకపోవడంతో జగన్ దారుణంగా పడిపోయారు. 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు వైసీపీ దిగజారిపోయింది. ఆ తర్వాత అయినా జగన్ వాస్తవాలు తెలుసుకుంటారని రెడ్డి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుంటారని అందరూ భావించారు. రెడ్డి సామాజిక వర్గంలోనూ ఇదే తరహా చర్చ నడిచింది. తమ విలువ ఇప్పటికైనా తెలుసుకుంటారని అనుకున్నారు.

కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న కీలకమైన పదవిని కూడా ఇప్పుడు తీసేయడం ఆస్థానంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు మరింతగా రెడ్డి సామాజిక వర్గం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జగన్ ఇక‌ మారడని తాము ఎందుకు సపోర్ట్ చేయాలని అనేకమంది నాయకులు అంతర్గత చర్చల్లో చెప్పుకొస్తున్నారు. దీనిని బట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మరింతగా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.