Begin typing your search above and press return to search.

చేతిలో అధికారం లేకుంటే అధినేతలు ఏపీలో ఉండలేరా?

సాయంత్రం 4.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుు చేరుకొని.. సాయంత్రం 6.40గంటలకు బెంగళూరు కెంపేగౌడ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 4:59 AM GMT
చేతిలో అధికారం లేకుంటే అధినేతలు ఏపీలో ఉండలేరా?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదేం దరిద్రం? అధికారం ఉన్నా లేకున్నా అధినేతలు తాము పాలించే రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం ఉంది. పవర్ చేతిలో ఉంటే ఒకలా.. పవర్ పోయినంతనే మరోలా వ్యవహరించే తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉండేవారు. ఏదైనా కార్యక్రమాలు ఉన్నా.. ఆందోళనలు ఉన్నా ఆయన ఏపీకి వచ్చేవారు.

కట్ చేస్తే 2019లో జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ చేతికి అధికార పగ్గాలు వచ్చాయి. అప్పటివరకు ఏపీని పాలించిన చంద్రబాబు.. కొద్దికాలానికే హైదరాబాద్ కు షిప్టు అయ్యారు. అంశాల వారీగా.. సందర్భానికి తగ్గట్లు ఏపీకి రావటం.. కొద్ది రోజులు ఉండటం ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లటం చేసేవారు. ఈ సందర్భంగా నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తీరును తప్పు పట్టేవారు. బహిరంగంగా విమర్శించే వారు కూడా. విపక్ష నేతగా చంద్రబాబు ఏపీలో ఉండకుండా హైదరాబాద్ లో ఉండటం ఏమిటని ప్రశ్నించేవారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే కాదు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ - గన్నవరం న్నట్లుగా సాగేది. ఎక్కువగా హైదరాబాద్ లో ఉండేవారు. గతంలో వీరిద్దరు ఇలా చేస్తే.. ఇప్పుడు వైసీపీ అధినేత వారి దారిలోనే నడుస్తున్నారు. గతంలో చంద్రబాబు.. పవన్ లను తాను విమర్శించానన్న విషయాన్ని వదిలేసి.. తనను విమర్శించే అవకాశాన్ని ఇచ్చేలా జగన్ తీరు ఉంది. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన బెంగళూరుకు షిప్టు అయ్యారు.

సందర్భానికి తగ్గట్లు గన్నవరం వస్తూ.. కొద్ది రోజులు ఉండి.. మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. గత వారమే గన్నవరం వచ్చిన ఆయన.. ఈ రోజు (శుక్రవారం) తిరిగి బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన జగన్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.

గన్నవరం ఎయిర్ పోర్టుకు శుక్రవారం మధ్యాహ్నం చేరుకొని సాయంత్రానికి బెంగళూరుకు చేరుకోనున్నారు. సాయంత్రం 4.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుు చేరుకొని.. సాయంత్రం 6.40గంటలకు బెంగళూరు కెంపేగౌడ్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి యలహంక నివాసానికి వెళ్లనున్నారు. ఇదంతా చూస్తే.. చేతిలో అధికారం ఉంటే ఏపీలో.. పవర్ లేనంతనే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతున్న అధినేతల తీరు చూస్తే.. ఏపీకి ఇదేం దరిద్రం అనుకోకుండా ఉండలేని దుస్థితి.