Begin typing your search above and press return to search.

జగన్ కోరిక తీరాలంటే మరో ఎన్నిక చూడాల్సిందేనా...!?

అయితే ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. భారీ ఎత్తున ఉద్యమాల సెగ కూడా వైసీపీ సర్కార్ ని తాకింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 5:12 PM GMT
జగన్ కోరిక తీరాలంటే మరో ఎన్నిక చూడాల్సిందేనా...!?
X

వైఎస్ జగన్ తీరని కోరికగా ఒకటి మిగిలిపోతోంది. ఎన్నికల నగరాకు అడుగు దూరంలో ఉన్న వేళ విశాఖ నుంచి పాలించాలని జగన్ ఆశలు నెరవేరే చాన్స్ లేదా అన్న చర్చ సాగుతోంది. 2019 చివరిలో సరిగ్గా ఇదే డిసెంబర్ నెలలో మూడు రాజధానుల గురించి జగన్ శీతాకాలం అసెంబ్లీ సమావేశాలలో సంచలన ప్రకటన చేశారు.

అయితే ఆ తరువాత అది ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. భారీ ఎత్తున ఉద్యమాల సెగ కూడా వైసీపీ సర్కార్ ని తాకింది. విపక్షాలను అమరావతి రాజధాని ఇష్యూ ఒకటి చేసింది. ఆ మీదట హైకోర్టులో విచారణ జరిగింది. ఈలోగానే ప్రభుత్వం తాము చేసిన మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకుంది. ఇక హైకోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టులో ప్రభుత్వం స్పెష్ల్ లీవ్ పిటిషన్ ని దాఖలు చేసింది

అక్కడ ఈ కేసు విచారణ దశలో ఉంది. ఈలోగా క్యాంప్ ఆఫీసు అయినా విశాఖలో పెట్టుకుని కొంతవరకైనా రాజధాని కళ కట్టిద్దామని వైసీపీ చూసింది. జగన్ సైతం విశాఖ కేంద్రంగా అలా అయినా పాలించాలన్న కోరిక తీర్చుకోవాలని చూశారు. దాని మీద అమరావతి రాజధాని పరిరక్షణ సమితి హై కోర్టులో కేసు వేసింది.

దాంతో ప్రభుత్వం తన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాము ప్రభుత్వ కాయ్రాలయాలను ఇప్పట్లో వైజాగ్ కి షిఫ్ట్ చేయమని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియచేశారు. దీని మీద జరుగుతున్న ప్రచారం ఒక అపోహ మాత్రమే అని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వ న్యాయవాది ఈ పిటిషన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీసు విశాఖ తరలింపు కేసు త్రిసభ్య ధర్మాసనం ముందు ఉందని పేర్కొంది.

ఇదిలా ఉంటే రుషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు మీద వివాదం ఉంది. రుషికొండ మీద పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారని దాఖలైన పిటిషన్ మీద కోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర బృందం కూడా రుషికొండను సందర్శించనుంది.

ఈ పరిణామాల క్రమంలో సీఎం విశాఖ రాకతో పాటు కార్యాలయాలు తరలింపు కూడా పెండింగులో పడ్డాయని అంటున్నారు. కచ్చితంగా డిసెంబర్ నెల మాత్రమే సమయం ఉంది. మంచి రోజులు అప్పటిదాకా ఉంటాయి. ఒకవేళ అది కుదరదు అనుకుంటే వచ్చే ఎన్నికల అనంతరమే విశాఖ రాజధాని వ్యవహారం చూడాల్సి ఉంటుంది. అంటే వైసీపీ 2024 ఎన్నికల్లో మరోమారు గెలిస్తే అపుడు మూడు రాజధానులకు అన్నిఅడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు. అప్పటిదాకా ఇది పెండింగులోనే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అయిదేళ్ల అధికారంలో జగన్ కి తీరని కోరికగా విశాఖ పాలన ఉండిపోతుందా అన్నది చూడాల్సి ఉంది.