Begin typing your search above and press return to search.

ఆ మూడు వర్గాలకు భారీ హామీలతో జగన్...!

రేపటి రోజున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినా వీటిని కంటిన్యూ చేయడం కష్టమే అన్న భావన ఉంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 3:15 AM GMT
ఆ మూడు వర్గాలకు భారీ హామీలతో జగన్...!
X

వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎన్నికల ప్రణాళిక ఎలా ఉండబోతోంది అన్నది చర్చనీయాంశం అయింది. దానికి కారణం ఇప్పటికే జగన్ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని సంక్షేమ పధకాలను ఇచ్చింది. ఇక వీటి కోసం కూడా అప్పులు తెచ్చి అయిదేళ్ల పాటు పాలన చేసింది. రేపటి రోజున మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినా వీటిని కంటిన్యూ చేయడం కష్టమే అన్న భావన ఉంది.

అయితే రాజకీయాల్లో ముందు ఎన్నికల గోదావరిని ఈదడమే ముఖ్యం. అందువల్ల వైసీపీ కూడా విపక్షాలకు ఎన్నికల వేళ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారీ హామీలను ఇవ్వడానికి ముందుకు వస్తోంది అని అంటున్నారు. అందులో ప్రధాన వర్గాలకు ఈ హామీలు ఉంటాయని అంటున్నారు. ఏపీలో రైతుల కోసం జగన్ ప్రభుత్వం భారీ హామీనే ముందుంచుతోంది.

రైతు రుణ మాఫీ అన్నది ఒక బ్రహ్మాస్త్రంగా వదులుతోంది. రైతు రుణ మాఫీ అంటే ఏపీలో దాదాపుగా ఉన్న అరవై లక్షలకు పైగా ఉన్న రైతన్నలకు భారీ మేలు సమకూర్చేదే. ఈ హామీని 2014 ఎన్నికలో ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అదే ఎన్నికల ముందు వైసీపీని కూడా ఆ పార్టీ వారు ఈ హామీ ఇవ్వమని అడిగినా మన వల్ల కాదు అని ఆయన ఇవ్వలేదని అంటారు.

ఇపుడు చూస్తే అయిదేళ్ల సీఎం తరువాత పాలన అనుభవం వచ్చిన తరువాత సర్కార్ కి వచ్చే ఆదాయాలు అప్పులు తెచ్చుకునే నేర్పు అన్నీ అవగతం అయ్యాక జగన్ కి రుణ మాఫీ ఇచ్చేందుకు అవకాశం వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల వేళ రైతు భరోసా పేరిట ప్రభుత్వం ఏడాదిని పన్నెండు వేలు ఇస్తామని చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తూంటే దానిని కూడా ఇందులో కలిపి ఇస్తున్నారు.

ఇక దీన్ని ఇరవై వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. సరే రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే. పైగా వారు తమకు ప్రయోజనం కలిగించిన పార్టీల వైపు మొగ్గుతారు. అందుకే జగన్ కూడా రైతు భరోసా నిధులను పెంచుతారో లేదో తెలియదు కానీ రుణ మాఫీ అంటూ భారీ హామీతో ముందుకు రాబోతున్నారు. అని అంటున్నారు.

ఇది ఎన్నికల వేళ టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు. అరవై లక్షల మంది రైతులకు ఉపయోగపడే ఈ హామీ వల్ల ఓట్లు గంపగుత్తగా వైసీపీకే పడతాయని అంటున్నారు మరో వైపు చూస్తే ప్రభుత్వంలో మరో అతి ముఖ్యమైన భాగం ఉద్యోగులు వారు పదమూడు లక్షల మంది దాకా ఉన్నారు.

ఇపుడు వారి కోసం ప్రభుత్వం భారీ ఎత్తున ఇంటీరియం రిలీఫ్ ని ప్రకటించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే 12వ వేతనాల సవరణ కమిటీని ఏర్పాటు చేశారు ఆ నివేదిక ఇప్పట్లో రాదు. పైగా ఉద్యోగులు తనకు 40 నుంచి నలభై శాతం ఫిట్ మెంట్ తో నూతన వేతన సవరణలలో లాభాలను ఇవ్వాలని కోరుతున్నారు

దాంతో ఇంటీరియం రిలీఫ్ నే భారీ ఎత్తున పెంచి వారి ఆశలను అలా తీరుస్తూ మరోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 45 శాతం ఫిట్ మెంట్ తో కొత్త వేతన సవరణ ఒప్పందాన్ని కుదురుస్తామని చెప్పబోతోంది. అలాగే తెలంగాణాల్లో సూపర్ గా సక్సెస్ అవుతూ మహిళలకు ఒక వరంగా మారిన ఆర్టీసీ లో ఉచిత ప్రయాణాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పరిశీలించి ఆ హామీని కూడా ఇవ్వబోతోంది అని అంటున్నారు. ఈ మూడు ప్రధాన హామీల ద్వారా కీలక వర్గాలను తనతో పాటు ఉంచుకుని ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.