అసెంబ్లీ వేదికగా బాబు అవినీతి స్కాముల చిట్టాతో జగన్...!
వారు బాబు అరెస్ట్ అక్రమం అంటే బాబు ప్రస్తుత అరెస్ట్ కానీ కేసులు కానీ జస్ట్ శాంపిల్ మాత్రమే అని వైసీపీ అంటోంది. ఆయన పాలనలో జరిగిన బిగ్ స్కాములు అన్నీ కూడా కలిపి అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ నిర్ణయించింది.
By: Tupaki Desk | 20 Sep 2023 5:33 PM GMTగురువారం నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలు ఈసారి పొలిటికల్ గా హీటెక్కించనున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తొలుత అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని భావించిన ఆ తరువాత మనసు మార్చుకుని అసెంబ్లీకి రావాలని డిసైడ్ అయ్యారు.
అసెంబ్లీలో బాబు అక్రమ అరెస్ట్ మీద చర్చకు వాయిదా తీర్మానం ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. దానికి కౌంటర్ గా వైసీపీ అయితే ఏకంగా బాబు హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటకు తీసి దాని మీద బిగ్ డిబేట్ నే నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈ డిబేట్ లో విపక్షం అయిన తెలుగుదేశం పార్టీ పాల్గొంటుందా అన్నది చూడాలి.
వారు బాబు అరెస్ట్ అక్రమం అంటే బాబు ప్రస్తుత అరెస్ట్ కానీ కేసులు కానీ జస్ట్ శాంపిల్ మాత్రమే అని వైసీపీ అంటోంది. ఆయన పాలనలో జరిగిన బిగ్ స్కాములు అన్నీ కూడా కలిపి అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని బాబు అవినీతి చిట్టా ఇదీ సుమా అని అయిదు కోట్ల మంది ఏపీ ప్రజలకు అసెంబ్లీ వేదికగా తెలియజేయనున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జగన్ మంత్రులకు కూడా బాబు అవినీతి మీద జరిగే డిబేట్ లో పాల్గొనాలని ఆ మేరకు పూర్తి సబ్జెక్ట్ తో రెడీ కావాలని కోరినట్లుగా తెలుస్తోంది. అలా టీడీపీ నిరసనలకు చెక్ చెప్పే విధంగా అసెంబ్లీ నుంచే బాబు అవినీతి మీద ప్రజలకు చేరేలా సందేశం ఇవ్వాలని వైసీపీ సర్కార్ పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే చంద్రబాబు అవినీతి అంటే 1997లో టీడీపీ పాలనలో చోటు చేసుకున్న ఏలేరు స్కాం నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా మొత్తం మ్యాటర్ ని కలెక్ట్ చేసే పనిలో వైసీపీ ఉంది అని అంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసు విషయం అయితే ఉండనే ఉంది, ఇది 2015 జరిగింది. దీని మీద బ్రీఫ్డ్ మీ అంటూ బాబు చెప్పిన మాటలు కూడా ఆడియో రికార్డులు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.
చంద్రబాబు అవినీతిలో ఇపుడు అరెస్ట్ అయి దొరికింది గోరంతే సుమా అని చెప్పడమే ఈ డిబేట్ ఉద్దేశ్యం అని అంటున్నారు. అక్రమ అరెస్ట్ కి కౌంటర్ గా స్పీకర్ కి అధికార పార్టీ బాబు అవినీతి మీద డిబేట్ కి తీర్మానం ఇస్తుందని అంటున్నారు. దానిని టేకప్ చేస్తారని, విపక్షం కూడా పాల్గొంటే ఈ చర్చ ఒక లెవెల్ లో సాగుతుంది. కానీ అలా జరుగుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.