జగ్గారెడ్డి సినిమాల్లో నటిస్తే ఎట్టా ఉంటాదో తెలుసా? వైరల్ పిక్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలో అడుగుపెట్టబోతున్నారు.
By: Tupaki Desk | 10 March 2025 3:14 PM ISTకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో సినిమా రంగంలో అడుగుపెట్టబోతున్నారు. త్వరలో విడుదల కానున్న ఓ ప్రేమకథా చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి నటిస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అచ్చం అఖండలో బాలయ్యలా సీరియస్ గెటప్ లో జగ్గారెడ్డి అదరగొట్టాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
రాజకీయ బాధ్యతల నుంచి కొంత విరామం తీసుకుంటున్న జగ్గారెడ్డి, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన ఆయన "నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఓ లవ్‌స్టోరీ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాను. ప్రేమికుల ప్రేమను కాపాడే నాయకుడిగా కనిపిస్తాను. మాఫియాను ఎదురించి ప్రేమికుల పెళ్లి చేయించే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నాను" అని చెప్పారు.
అంతేకాదు "రాజకీయాలను కొనసాగిస్తూనే, సినిమాల్లో కూడా నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. నన్నెవరూ రాజకీయంగా తొక్కలేరు. నా ఒరిజినల్ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు సినిమాలో చూస్తారు. ఉగాదికి కథ విని, వచ్చే ఉగాదికి సినిమాను పూర్తి చేస్తాను. ముఖ్యమంత్రి, పార్టీ నేతల అనుమతి తీసుకుని ఏడాది పాటు నటించనున్నాను" అని జగ్గారెడ్డి వెల్లడించారు.
ఈ సినిమాకు వద్ది రామానుజం దర్శకత్వం వహించనున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. రాజకీయ నేతగా మాత్రమే కాదు, ఇప్పుడు నటుడిగా కూడా తన టాలెంట్ చూపించనున్న జగ్గారెడ్డి చిత్ర పరిశ్రమలో ఎలాంటి ముద్ర వేస్తారో చూడాల్సి ఉంది. ఆయన సినిమా ఎంట్రీతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.