ఏపీలో ఆ హాట్ సీటులో ఆ సెంటిమెంటే రిపీట్ అవుతుందా...!
వచ్చే ఎన్నికలు కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పార్టీలు.. నాయకులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు
By: Tupaki Desk | 25 Dec 2023 4:11 AM GMTవచ్చే ఎన్నికలు కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పార్టీలు.. నాయకులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా బలమైన అభ్యర్థులతోపాటు సామాజిక వర్గాల పరంగా కూడా.. నాయ కుల ఎంపికకు పార్టీలు శ్రీకారం చుడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గం పేట నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ గత మూడు ఎన్నికలను పరిశీలిస్తే.. ఒక కీలకమైన సెంటిమెంటు కొనసాగుతోంది.
ఇదే సెంటిమెంటు కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో మరింతగా ఈ నియోజకవర్గం వేడెక్కుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఈ క్రమంలోనే ఇటు వైసీపీ, అటు టీడీపీ కూడా.. నాయకులపై కసరత్తు ముమ్మరం చేశాయి. జగ్గంపేటలో ఒకసారి గెలిచిన అభ్యర్థిని పార్టీలతో సంబంధం లేకుండా.. ప్రజలు ఓడిస్తున్నారు. ఇదే ఇప్పుడు సెంటిమెంటుగా మారింది. దీంతో ఇప్పుడున్న సిట్టింగ్ జ్యోతుల చంటిబాబాబును వైసీపీ పక్కన పెట్టడానికి కారణమని అంటున్నారు.
జ్యోతుల చంటి బాబుకు టికెట్ లేదని..ఇ ప్పటికే అధిష్టానం చెప్పేసింది. ఈ క్రమంలో పలువురు కీలక నాయకుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఇదిలావుంటే.. 2009లో కాంగ్రెస్ తరఫున తోట నరసింహం విజయందక్కించుకున్నారు.ఇదేసమయంలో బాబాయ్.. అబ్బాయిలు.. జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబును ఓడించారు. వీరిరువురూ.. టీడీపీ, ప్రజారాజ్యం పార్టీల తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
ఇక, 2014 ఎన్నికలకు వచ్చేసరికి.. నెహ్రూ.. వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. ఈయనే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేశారు. కానీ, ఇక్కడి ప్రజలు ఓడించారు. జ్యోతుల చంటిబాబును గెలిపించారు. ఇదే సెంటిమెంటును వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు ఫాలో అయితే.. చంటిబాబు ఓటమి ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇదేసమయంలో జ్యోతుల నెహ్రూకు గెలుపు దక్కుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ టీడీపీలు చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని తెలుస్తోంది.