Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి కష్టాలు ఎవరికీ రాకూడదు !

బీజేపీ నేతగా ఉన్న జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు.

By:  Tupaki Desk   |   23 April 2024 3:51 AM GMT
జగ్గారెడ్డి కష్టాలు ఎవరికీ రాకూడదు !
X

బీజేపీ నేతగా ఉన్న జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరి 2004 లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత వైఎస్ కు అండగా నిలిచాడు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 2014లో దాదాపు 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఆ వెంటనే బీజేపీలో చేరి మెదక్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలిచాడు. గత కొన్నేళ్ళుగా కాంగ్రెస్ లో తానే కీలకమని రేవంత్ మీద నిప్పులు చెరుగుతున్న జగ్గారెడ్డి ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు.

కాలం మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గెలిస్తే జగ్గారెడ్డికి మంత్రి పదవి ఖాయం. కానీ ఆయన ఓడిపోయాడు. ఆయన ప్రత్యర్థి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే జగ్గారెడ్డి కొన్నాళ్ళుగా రేవంత్ కు అనుకూలంగా మాటమార్చాడు.

ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, మంత్రులు మంత్రులుగా ఉంటారని, దీనిలో ఎలాంటి అనుమానం లేదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటున్నారు. ఓ ఛానల్ క్వశ్చన్ అవర్‌లో ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తాము మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మా వ్యూహాలు మాకు ఉన్నాయన్నారు.

నా టైమ్ బాగాలేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఓడిపోయానని, అధికారంలో ఉన్నా... లేకపోయినా నేను బలమైన లీడర్ అని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా తొలగించాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని... కానీ అది ముగిసిపోయిన ఎపిసోడ్ అని .. తాను రేవంత్ రెడ్డిపై మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఓ మాట చెప్పారని... మనం అధికారంలోకి రాబోతున్నాం. ఎవరినీ ఏమీ అనవద్దని సూచించారని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తను కాబట్టి మా పార్టీ నేత చెప్పింది విన్నానని అన్నారు. ఆనాటి నుంచి తాను రేవంత్ రెడ్డిని ఏమీ అనలేదని వెల్లడించారు. మొత్తానికి జగ్గారెడ్డి కష్టాలు ఎవరికీ రాకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.