రాహుల్‌గాంధీకి మళ్లీ జైలు శిక్ష.. అడ్డంగా దొరికికేశాడే!
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
By: Tupaki Desk | 22 Dec 2023 8:17 AM GMTకాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీకి మరోసారి జైలు శిక్ష తప్పేలా లేదని.. న్యాయ నిపుణు లు అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రపంచకప్ క్రికెట్ లో భారత జట్టు ఓటమిని ప్రస్తావిస్తూ.. ఆయన ప్రధా ని నరేంద్ర మోడీపై పరోక్ష విమర్శలు చేశారు. స్టేడియంలోకి దుశ్శకునం వచ్చిందని.. అందుకే భారత జట్టు ఓడిపోయిందని ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మిజోరాంలో వ్యాఖ్యానించారు. అదేసమయం లో 'పిక్ పాకెట్' అని కూడా కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ హైకోర్టు రాహుల్‌గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మోడీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు.. రాహుల్ స్థాయిని మరిచి ఇలా వ్యాఖ్యానించడంసబబు కాదని పేర్కొంది. ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఈ పరిణామాలతో రాహుల్‌గాంధీకి మరోసారి జైలు తప్పేలా లేదని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుంటే, 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో నూ మోడీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలేనని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ కోర్టులో కేసు దాఖలు కావడం.. ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష పడడం తెలిసిందే. అదేసమయంలో రూ.2 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.
ఇక, ఆ కేసులో ప్రస్తుతం రాహుల్‌గాంధీ బెయిల్ పొందారు.ఇ క, కేసు కొంత ఊరట ఇచ్చిందని అనుకునే లోగానే ఇంతలో మరోసారి ప్రధానిమోడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు మరింతగా రాహుల్‌కు సెగ పుట్టిస్తుండడం గమనార్హం. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.