Begin typing your search above and press return to search.

జై శ్రీరాం అన్న పార్టీలు

బీజేపీ అయితే ప్రతీ చోటా విశాఖలో రాముడి కోవెలలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:23 PM GMT
జై శ్రీరాం అన్న పార్టీలు
X

రాముడు అందరివాడు. అయితే జై శ్రీరాం అంటే బీజేపీ మాకే సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. అయోధ్యలో రామ మందిరం ప్రారంభంతో పాటు బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. బీజేపీ అయితే ప్రతీ చోటా విశాఖలో రాముడి కోవెలలలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలు పంచుకుంది.

ఒక విధంగా బీజేపీ అయోధ్య రాముడి కార్యక్రమాన్ని భుజాన మోసింది. మేము కూడా అంటూ తెలుగుదేశం నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గణబాబు రాముడి సేవలో పాల్గొన్నారు. రాముడి ఊరేగింపులో ఆయన పాలుపంచుకున్నారు.

విశాఖ ఉత్తరంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గం ఇంచార్జి కె కె రాజు రామాలయాలలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో ఆయన పాల్గొన్నారు. జై శ్రీరాం అంటూ అనేక చోట్ల వైసీపీ టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పోటీ పడ్డారు.

కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రమే దీనికి మినహాయింపు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అయోధ్యలో జరిగే విగ్రహ ప్రతిష్టకు హాజరు కాలేదు. కామ్రేడ్స్ అయితే లెఫ్ట్ ఫిలాసఫీ కాబట్టి వీటికి బహు దూరం. ఇవన్నీ చూసినపుడు అయోధ్య రాముడు అందరి వాడు అంటూ ఈసారి మూడు ప్రధాన పార్టీలు మాత్రం భక్తిలోనూ పోటీ పడ్డాయి. రాముడి దయ తమ మీద ఉండాలని కోరుకున్నాయి.