వేల కోట్ల బిట్ కాయిన్స్.. లక్ష టన్నుల చెత్త.. ఆసక్తికరంగా ఓ టెకీ కథ!
యూకేలోని న్యూపోర్ట్ కు చెందిన హోవెల్స్ అనే వ్యక్తి వద్ద సుమారు 8,000 బిట్ కాయిన్ నిల్వ ఉన్న హార్డ్ డ్రైవ్ ఉండగా..
By: Tupaki Desk | 13 Feb 2025 2:30 PM GMTయూకేలోని న్యూపోర్ట్ కు చెందిన హోవెల్స్ అనే వ్యక్తి వద్ద సుమారు 8,000 బిట్ కాయిన్ నిల్వ ఉన్న హార్డ్ డ్రైవ్ ఉండగా.. ఈ బిట్ కాయిన్ విలువ ప్రస్తుత మార్కెట్ లో సుమారు 6,500 కోట్ల రూపాయలు అని అంటున్నారు. అయితే... అంత విలువైన హార్డ్ డ్రైవ్ ను అతడి గర్ల్ ఫ్రెండ్ డస్ట్ బిన్ లో పాడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత ఏడాది నవంబర్ లో జరిగింది.
హౌస్ క్లీనింగ్ చేసిన సమయంలో ఆ హార్డ్ డ్రైవ్ ను ఆమె బయట పారేసింది. దీంతో.. దాన్ని డస్ట్ బిన్ బ్యాగ్ లో పోగు చేసి, సమీపంలోని డంప్ లో పారవేశారట. ఈ సమయంలో... హోవెల్స్ ఈ డంప్ లో ఉన్న తన హార్డ్ డ్రైవ్ ను వెతకడానికి సహకరిస్తే 10% డబ్బును స్థానిక అభివృద్ధికి విరాళంగా ఇస్తానని కూడా చెప్పిన పరిస్థితి.
అయితే... సుమారు లక్ష టన్నుల చెత్త కుప్పలో ఆ హార్డ్ డ్రైవ్ ను వెతకడం ఆల్ మోస్ట్ అసాధ్యం అనేది అధికారుల అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. హైకోర్టునూ ఆశ్రయించాడు. అక్కడ వెతకడం వల్ల దగ్గరలోని ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని కోర్టు అతడి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో.. అతడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాడు.
అవును... చెత్తకుప్పలో ఉన్న హార్డ్ డ్రైవ్ ను వెతకడానికి అటు అధికారులు అనుమతివ్వక, ఇటు కోర్టు కూడా తిరస్కరించడంతో.. ఆ సైట్ మొత్తం కొనాలనే ఆలోచనకు వచ్చాడంట హోవెల్స్. న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ నుంచి దాన్ని యధాతథంగా కొనడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నాడు. దీనిపై తన పార్ట్ నర్స్ తో కూడా చర్చించాడట.
ఓ పక్క బిట్ కాయిన్ రేటు రోజు రోజుకీ పెరిగిపోతోన్న వేళ.. అన్ని వేల కోట్ల విలువైన బిట్ కాయిన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ కోసం సుమారు లక్ష టన్నుల చెత్తను కొనడానికి సిద్ధపడుతున్నాడు ఈ టెకీ. మరి అతడి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి.
కాగా... మొదటి నుంచీ డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీపై అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది. ఇందులో భాగంగా.. ఓ దశలో దాని విలువ సుమారు లక్ష డాలర్లకు చేరుకోగా.. ప్రస్తుతం 96వేల డాలర్లకు పైనే ఉంది!