2027లోనే జమిలి ఎన్నికలు...బీజేపీ రోడ్ మ్యాప్ రెడీ
ఒక వేళ 2027 ఎండింగ్ లో ఎన్నికలు పెడితే మాత్రం దాదాపుగా మూడేళ్ల వ్యవధి ఉంటుంది.
By: Tupaki Desk | 10 Dec 2024 3:32 AM GMTదేశంలో మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయా అంటే వస్తాయని ఢిల్లీ వర్గాలు అంటున్నారు. రెండేళ్లు ఏంటి అంటే 2024 మరి కొద్ది రోజులలో ముగిసి 2025లోకి ఎంట్రీ ఇస్తున్న వేళ కేంద్రంలో ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ జమిలి ఎన్నికల మీద రోడ్ మ్యాప్ తో సిద్ధంగా ఉంది. 2025కి 2027 కచ్చితంగా రెండెళ్ళే. ఒక వేళ 2027 ఎండింగ్ లో ఎన్నికలు పెడితే మాత్రం దాదాపుగా మూడేళ్ల వ్యవధి ఉంటుంది.
అయితే అంతవరకూ కధను ముందుకు తీసుకుని పోలేరు. జమిలి ఎన్నికలు అంటే దానికి ఏణ్ణర్థం ముందునా తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికలను కూడా చేర్చాలి కాబట్టి 2027 మేలోనే ఎన్నికలు పెడతారు అని అంటున్నారు. అలా కాదు అంటే జమిలి ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని అంట్న్నాయి ఢిల్లీ వర్గాలు.
ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లుని ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చిన నివేదికను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించి తొలి అడుగు వేసింది.
ఇక వేయాల్సిన మరిన్ని అడుగులకు రంగం సిద్ధం అవుతోంది. ఇక బీజేపీ ఒక పద్ధతి ప్రకారం ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లుని తీసుకుని వస్తోంది అని అంటున్నారు. జమిలి ఎన్నికల బిల్లుకు లోక్ సభ రాజ్యసభలలో ఆమోదముద్ర పడేలా బీజేపీ పెద్దలు చూస్తున్నారు. అదే జరిగితే ఇక బీజేపీ జమిలి ఎనికల రధానికి బ్రేకులు ఉండవని అంటున్నారు.
ఇక 2027లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ తో పాటు అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఇక జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుని చాలా జాగ్రత్తగా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపొందించింది అని అంటున్నారు.
జమిలి ఎన్నికల వల్ల దేశంలో అయిదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికల హడావుడి ఉంటుంది. మిగిలిన సమయంలో అభివృద్ధి మీదనే దృష్టి ఉంటుందని అలాగే ఖర్చులు కూడా కలసి వస్తాయని బీజేపీ అంటోంది. అయితే విపక్షాలు మాత్రం జమిలి ఎన్నికలు వద్దు అని అది బీజేపీ జాతీయ అజెండాను రాష్ట్రాల మీద రుద్దడానికి అని అంటున్నారు తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు.
వామపక్షాలతో పాటు ఇండియా కూటమిలోనూ వ్యతిరేకత ఉంది. అయితే ఎన్నికలు మళ్లీ వస్తే గెలవవచ్చు అన్న ఆశ కూడా ఎక్కడో విపక్షాలలో ఉండడంతో పార్లమెంట్ లో జమిలి బిల్లు పెడితే స్పందన భిన్నంగా ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద బీజేపీ జమిలి ఎన్నికల కోసం చకచకా పావులు కదుపుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.