భారత్ లో 'ఆధార్' లేని రాష్ట్రం.. మరి ఇకనైనా చాన్సుందా?
భారత దేశంలో రాష్ట్రాలెన్ని అంటే.. కనీస జనరల్ నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా 29 అని చెబుతారు.
By: Tupaki Desk | 5 Feb 2025 10:30 PM GMTభారత దేశంలో రాష్ట్రాలెన్ని అంటే.. కనీస జనరల్ నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా 29 అని చెబుతారు. ఇందులోనూ చిట్టచివరగా ఏర్పడినది తెలంగాణ అని కూడా చెబుతారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) ఎన్ని అంటే కాస్త ఆలోచిస్తారు. కొన్నేళ్ల వరకు ఏడు అని చెప్పేవారు. కానీ, ఐదేళ్ల కిందట లద్దాఖ్ కూడా యూటీగా ఏర్పాటైంది. అంటే.. భారత్ లోని యూటీలు 8.
భారత పౌరులందరి కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టినది ఆధార్ కార్డు. ఇప్పటికే ప్రతి భారతీయుడు దీనిని పొందారు. దేశ పౌరులకు ప్రాథమిక ధ్రుపత్రంగానూ మారిపోయింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు వేటికైనా ఆధార్ కీలకమైంది. ఆఖరికి సిమ్ కార్డులు తీసుకోవడానికి ఆధార్ ప్రామాణికమైంది. ఆధార్ లేకపోతే ప్రయోజనాలు పొందలేని పరిస్థితి నెలకొంది.
ఇక్కడ మాత్ర ఆధార్ లేదు..
దేశంలోని 29 రాష్ట్రాలకు గాను ఇప్పటికీ ఒక రాష్ట్రంలో ఆధార్ లేదంటే మనం నమ్మాలి. ఆ రాష్ట్రమే జమ్మూ కశ్మీర్. కాగా, 2019లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370ని రద్దు చేసి లద్దాఖ్ ను వేరుచేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు ఆరేళ్లు ప్రభుత్వం లేదు. రెండు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి గెలుపొందింది.
కశ్మీర్ ప్రజలకు ఇప్పటికీ ఆధార్ కార్డులు లేవు. కుంకుమ పువ్వు పంటకు ప్రసిద్ధిగాంచిన కశ్మీర్ కు పాకిస్థాన్ తో సరిహద్దులున్నాయి. గతంలో చైనాతోనూ సరిహద్దు ఉంది. ఉగ్రవాదులు, చొరబాటుదారుల ముప్పు ఎక్కువ. ఉగ్ర మూకలు దాడులకు పాల్పడుతుంటాయి. భద్రతా బలగాలకు సవాల్ విసురుతుంటాయి. భద్రత కల్పించడం రక్షక దళాలకు కత్తిమీద సాము. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాల దృష్ట్యా జమ్ముకశ్మీర్ లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు.
నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి చొరబాటుదారులు ప్రవేశించే ప్రమాదం ఉండడంతో ఆధార్ జారీని నిలిపివేశారు. ఇక్కడి ప్రజలకు గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర ధ్రువపత్రాలను ఇస్తున్నారు.
కాగా, కశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినా ఇప్పటికైతే ఆధార్ జారీ కష్టమే.