Begin typing your search above and press return to search.

ఎన్డీయే కన్వీనర్ గా పవన్ కళ్యాణ్..?

ఆ కీలకమైన పదవికి పవన్ కళ్యాణ్ పేరుని చాలా సీరియస్ గా బీజేపీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 July 2023 3:50 PM GMT
ఎన్డీయే కన్వీనర్ గా పవన్ కళ్యాణ్..?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ని అమాంతం పెంచే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారా, పవన్ని కేవలం ఏపీకి మాత్రమే కాకుండా మొత్తం సౌతిండియా లెవెల్ లో వాడుకునే ఆలోచన చేస్తున్నారా అంటే ఢిల్లీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మాత్రం అవును అనే వస్తోంది.

పవన్ కళ్యాణ్ ని 2014 తరువాత దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశానికి బీజేపీ పిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీగా జనసేన ఈ మీటింగ్ కి అటెండ్ అయింది. ఆ విధంగా పవన్ పోలిటికల్ స్థాయిని వైసీపీ టీడీపీ బీయారెస్ లతో సరిసమానంగా పెంచే వ్యూహాన్ని బీజేపీ రచించింది.

ఇక ఇపుడు రెండవ ఎపిసోడ్ కి బీజేపీ తెర తీస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఫుల్ మెజారిటీని సాధించేది అయితే ఉండదని అంటున్నారు. ఇక ఎన్డీయే మీద బీజేపీ పూర్తి స్థాయిలో ఆధారపడాల్సిన నేపధ్యం ఉంది.

దాని కోసమే దేశంలోని చిన్నా చితకా పార్టీలను అన్నింటినీ కలుపుకుని బీజేపీ మొత్తం 38 పార్టీలతో ఎన్డీయే మీటింగ్ ని నిర్వహించింది. ఇపుడు ఎన్డీయేను మరింతగా పటిష్టం చేసేందుకు బీజేపీ కొత్త ఆలోచన చేస్తోంది. నిజానికి ఎన్డీయేకు జాతీయ స్థాయిలో ఒక కన్వీనర్ ఉంటారు. చైర్మన్ హోదాలో పెద్ద పార్టీగా బీజేపీ ఉంటుంది. కానీ ఇపుడు దాన్ని కాస్తా మార్చేసి దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాలను తీసుకుని ఆరు రీజియన్స్ గా చేసుకుని వాటికి కన్వీనర్లను నియమించాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

సౌత్ స్టేట్స్ కి ఒక కన్వీనర్, అలాగే ఈస్ట్ స్టేట్స్ కి మరో కన్వీనర్, మధ్య భారతానికి ఒక కన్వీనర్, ఈశాన్య రాష్ట్రాలకు మరో కన్వీనర్, ఉత్తర భారతానికీ, తూర్పు భారతానికి ఇద్దరు కన్వీనర్లు వంతున మొత్తం ఆరుగురు కన్వీనర్లను నియమించాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తోంది అని అంటున్నారు.

అలా చూసుకుంటే సౌతిండియాలోని రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి వంటివి కలుపుకోని మొత్తం రీజియన్ కి ఒక కన్వీనర్ ఎన్డీయే నుంచి ఉంటారని అంటున్నారు. ఆ కీలకమైన పదవికి పవన్ కళ్యాణ్ పేరుని చాలా సీరియస్ గా బీజేపీ అగ్ర నాయకత్వం పరిశీలిస్తోంది అని అంటున్నారు.

సినీ గ్లామర్ ఫుల్ గా ఉన్న పవన్ని కన్వీనర్ గా ఉంచితే ఆయన ప్రచారంతో సౌతిండియా మొత్తం పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని అలాగే ఎన్డీయే మిత్ర పక్షాల విజయం కూడా సాధ్యమవుతుందని భావిస్తోందిట బీజేపీ. ఇక పవన్ కి ఎన్డీయే కన్వీనర్ పదవి ఇస్తే ఆయనతో తెలంగాణాలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయించుకోవచ్చు అని మరో ఆలోచన ఉందని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే పవన్ సినీ క్రేజ్ ని యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ని ఎన్డీయే కూటమి బలోపేతానికి బీజేపీ వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. ఇది ప్రస్తుతానికి ప్రచారంలో ఉంది. తొందరలోనే ఆరుగురు ఎన్డీయే కన్వీనర్ల నియామకం జరుగుతుందని, పవన్ కి సౌతిండియా కన్వీనర్ గా చాన్స్ దక్కడం ఖాయమని అంటున్నారు. పవన్ ఈ బాధ్యతలను తీసుకున్న తరువాత ఎన్డీయే కూటమిలోకి కొత్త పార్టీలను కూడా తీసుకుని వచ్చే పాత్రను కూడా పోషించవచ్చు అని అంటున్నారు.

మొత్తానికి అటు జగన్ సీఎం, ఇటు చంద్రబాబు మాజీ సీఎం. పవన్ ని ఎన్డీయే కన్వీనర్ గా ప్రమోట్ చేస్తే వారికి ధీటుగా ఆయన రాజకీయంగా ఏపీలోనూ దూసుకుపోతారని తమ అండదండలు ఎటూ ఉంటాయని బీజేపీ భావిస్తూ ఈ స్కెచ్ గీసింది అని అంటున్నారు.