పిఠాపురం దద్దరిల్లుతుందిట !
ఇపుడు పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ హోదాలో తొమ్మిది నెలల తన పాలనను పూర్తి చేసుకున్నారు.
By: Tupaki Desk | 8 March 2025 1:00 AM ISTఅవును. పిఠాపురం దద్దరిల్లుతుంది అని జనసైనికులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. పిఠాపురం ఈ రోజు ఏపీలో టాప్ ప్రయారిటీ లో ఉన్న ప్రాంతంగా ఉంది అంటే అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావడమే అంటున్నారు. ఇపుడు పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ హోదాలో తొమ్మిది నెలల తన పాలనను పూర్తి చేసుకున్నారు.
పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పర్యావరణం అటవీ శాఖను చూస్తూ అందులో సంచలన నిర్ణయాలను తీసుకునే మినిస్టర్ గా పవర్ కి ఎంతో పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరగబోతోంది. జనసేన అధికారంలో లేకుండా 11 ఆవిర్భావ సభలు జరిగాయి.
దానిని అభిమానంతో జనసైనికులు అంతా కలసి ఎంతో ఘనంగా చేశారు. అలా చేసిన నాటి జనసేన సభలకే ఏకంగా ఆరేడు లక్షల మందికి తక్కువ కాకుండా జనాలు వచ్చారు. గత ఏడాది మచిలీపట్నంలో జరిగిన సభకు ఏడు లక్షల దాకా వచ్చారని అంచనా. దాని కంటే ముందు ఇప్పటం సభకు కూడా లక్షలాది మంది వచ్చి జనసేనని సూపర్ హిట్ చేశారు.
ఇపుడు పిఠాపురంలో ఆవిర్భావ సభ జరుగుతోంది. ఎలా జరుగుతోంది అంటే జనసైనికులు చెబుతున్న ఒకే ఒక మాట దద్దరిల్లి పోయేలా అని. 11 సభలూ ఒక ఎత్తు. ఒక్క పిఠాపురం సభ ఒక ఎత్తు అని అంటున్నారు. ఈ సభతో ఏపీ రాజకీయంలో రీ సౌండ్ వినిపిస్తుందని అంటున్నారు.
ఈ నెల 14న జరిగే పిఠాపురం బహిరంగ సభకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అవుతున్నాయి. ఈ నెల 12తో సభాస్థలి మొత్తం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సభకు ఏకంగా 15 లక్షల మంది దాకా జనాలు వస్తారని అంచనా వేస్తున్నామని చెబుతున్నారు.
ఇక వేదికను కూడా ఎంతో ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 150 మంది దాకా ఆహూతులు కూర్చునే విధంగా ఈ వేదిక ఉంటుంది అని అంటున్నారు. ఈ వేదిక మీద నుంచి పవన్ అందరికీ కనిపిస్తారు అని ఆయనకు కూడా అందరూ కనిపిస్తారు అని అంటున్నారు. మొత్తం యాభై ఎకరాల స్థలంలో కేవలం 30 ఎకరాలను సభకు వచ్చే జనాల కోసమే కేటాయిస్తున్నారు అంటే ఈ సభను ఎంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది అని అంటున్నారు.
ఈ సభలో పవన్ ప్రసంగం ప్రధాన ఆకర్షణ అన్నది తెలిసిందే. అంతే కాదు ఆయన సంచలన ప్రకటనలు చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా చాలా మంది పెద్ద నాయకులు జనసేనలో అదే రోజున చేరబోతున్నారుట. మొత్తానికి చూస్తే పిఠాపురంలో ఈ సభను నిర్వహించడం మాకు ఆనందం అని అక్కడ జనాలు చెబుతూంటే పవన్ తనపైన ప్రేమతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ఈ సభని నిర్వహిస్తున్నారు అని అంటున్నారు.
అంతే కాదు 21 సీట్లకు పోటీ చేస్తే 21 గెలిచి వంద శాతం స్ట్రైక్ రేటుని సాధించినందుకు జనసేన విజోత్సవాలుగా కూడా వీటిని నిర్వహిస్తున్నారు. మొత్తానికి మార్చి 14 పిఠాపురం దద్దరిల్లుతుంది అన్నది డ్యాం ష్యూర్ అని సైనికులు చెబుతున్నారు.