పల్లె సరే.. జనసేనలోనే "పండుగ" ..!
ప్రస్తుతం పల్లె పండుగ పేరుతో జనసేన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పల్లెల్లో రహదారులు, తాగునీటి వనరుల కల్పన ద్వారా.. పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 Oct 2024 8:30 PM GMTమరో ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులుగా ఉన్నవారు.. పంచాయతీలను దక్కించు కున్నారు. అయితే.. విజయం దక్కించుకున్నా.. పెదవి విరుపులు కూడా ఎక్కువగా కనిపించాయి. దీనికి కారణం.. వైసీపీ తమకు నిధులు ఇవ్వడం లేదని కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వాడేసుకుంటోందని పెద్ద ఎత్తున పంచాయతీ ప్రెసిడెంట్లు ఆరోపించారు.
ఈ పరిణామమే తర్వాత కాలంలో వైసీపీ ఓటమికి దారి తీసింది. కట్ చేస్తే.. వైసీపీకి గ్రామీణ లెవిల్లో ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి గ్రామీణ ఓటర్లు బాగానే మద్దతిచ్చా రు. పార్టీ ఓడిపోయినా.. సుమారు 40 శాతం మేరకు పార్టీకి ఓట్లు వచ్చాయంటే దానికి కారణం గ్రామీణ ఓటు బ్యాంకు బలంగా ఉండడంతోనే అని వైసీపీ అధినేత చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ గ్రామీణ ఓటుబ్యాంకునే వైసీపీ ప్రత్యర్థి పార్టీ జనసేన టార్గెట్ చేసింది.
వచ్చే ఏడాది పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పైకిఈ విషయం చెప్పకుండానే గ్రామీణ ప్రాంతా ల్లో పుంజుకునేందుకు పక్కా లెక్కలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం పల్లె పండుగ పేరుతో జనసేన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పల్లెల్లో రహదారులు, తాగునీటి వనరుల కల్పన ద్వారా.. పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకురావాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే.. ఎన్ని సదుద్దేశాలు ఉన్నా .. ఎన్నికలే అంతిమం.
ఈ నేపథ్యంలోనే 4500 కోట్ల రూపాయల మేరకు వెచ్చించి.. గ్రామ పండుగలను నిర్వహిస్తున్నారు. ఇది గ్రామీణ స్థాయిలో జనసేన పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నది జనసేన పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. పల్లెల్లో ఎవరు అభివృద్ధి చేస్తే.. ప్రజలు వారివైపే ఉంటారన్నది వాస్తవం. ఈ నాడిని పసిగట్టిన పవన్.. ఇప్పుడు ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు.. పల్లె పండుగ ద్వారా.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఏడాదికి 100 రోజులకు తగ్గకుండా పని కల్పించనున్నారు.
తద్వారాగ్రామీణ ప్రాంతాల్లో వలసలను కూడా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలే.. ఇప్పుడు జనసేన చుట్టూ.. రాజకీయాలను మరింత బలోపేతం చేయనున్నాయని పరిశీలకులు అంటు న్నారు. పల్లె పండుగ-పంచాయతీరాజ్ వారోత్సవాలు కనుక విజయవంతం అయితే.. జనసేన పేరు ప్రజల్లో చిరస్థాయిగా ఉండిపోతుందని కూడా అంచనా వేయడం గమనార్హం.