Begin typing your search above and press return to search.

జనసేన బెస్ట్ ఆప్షన్... ఎందుకంటే ?

ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో రెండు నిండుగా అధికారం అనుభవించినవి.

By:  Tupaki Desk   |   22 Sep 2024 1:30 AM GMT
జనసేన బెస్ట్ ఆప్షన్... ఎందుకంటే ?
X

ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో రెండు నిండుగా అధికారం అనుభవించినవి. మూడవ పార్టీ అధికారంలో భాగస్వామిగా మాత్రమే ఉంది. ఆ మూడు పార్టీలే టీడీపీ వైసీపీ, జనసేన. ఇందులో రేపటి రోజుల అధికారంలోకి వచ్చే చాన్స్ జనసేనకు కచ్చితంగా ఉంది.

ఎందుకంటే ఏపీ ప్రజలు ఎప్పటికపుడు మార్పుని కోరుకుంటారు. వారు అలా కోరుకోకపోతే కంచుకోట లాంటి కాంగ్రెస్ అడ్డాలో టీడీపీ వచ్చేది కాదు, టీడీపీకి పట్టుగొమ్మ లాంటి ఏపీలో వైసీపీ అడుగుపెట్టేది కాదు, ఇక జనసేనకు కూడా ముందు ముందు అవకాశాలు దండీగా ఉన్నాయి. జనసేన కూడా నెమ్మదిగా తన రాజకీయ వ్యూహాన్ని అదే దిశగా అమలు చేస్తూ పోతోంది.

మరో వైపు చూస్తే ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఆధికారం ఆ పార్టీకి కొత్త కాదు, టీడీపీ పెద్ద పార్టీ. ఇక టీడీపీలో చేరాలని ఎవరైనా అనుకున్నా నాలుగు దశాబ్దాల పార్టీ అది. ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులు కోకొల్లలుగా ఉన్నారు. అంతే కాదు ఆ పార్టీలో ఇప్పటికే హౌజ్ ఫుల్ గా ఉంది. ఎవరు వచ్చి చేరినా కూడా టీడీపీలో అందరిలో ఒకరుగా ఉండాల్సిందే.

మరో వైపు చూస్తే టీడీపీలో ఒక బలమైన సామాజిక వర్గం పెత్తనం అన్యాపదేశంగా ఉంటూ ఉంటుందని కూడా అంటారు. దాంతో స్వేచ్చను కోరుకునే వారు కొంత ఆలోచిస్తున్నారు. ఇక వైసీపీలో అయితే అధినాయకత్వం పోకడలు చూసిన వారు విసుగు చెందిన వారు ఉన్నారు వైసీపీని పార్టీగా కాకుండా ఒక కార్పొరేట్ సంస్థగా నడుపుతున్నారు అన్న విమర్శ ఉంది.

నా పార్టీ అన్నట్లుగా వైసీపీ అధినాయకత్వం వ్యవహరిస్తూ ఉన్న వాళ్ళు ఉండవచ్చు లేని వారు పోవచ్చు అన్న ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. ఈ పరిణామాలతో ఏళ్ళ తరబడి వైసీపీలో ఉన్న వారు కూడా తమ బంధాలను తెంచుకుంటున్నారు. వీటికి మించి వైసీపీలో నియోజకవర్గం నాయకులకు విలువ లేదని ఒక అసంతృప్తి కూడా ఉంది అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేన వైసీపీ వారికి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది. అది ఎలా అంటే టీడీపీకి యాంటీగా పాలిటిక్స్ చేసిన వారికి ఇపుడు జనసేనలో చేరడమే ఉత్తమంగా ఉంది అని అంటున్నారు. జనసేనలో అధినాయకుడు పవన్ కళ్యాణ్ నియంత పోకడలు చూపించరు అని అంటున్నారు.

ఆయన ఒక నాయకుడిని నమ్మారు అంటే ఆయనకే నియోజకవర్గం పగ్గాలు అప్పగిస్తే వారే అక్కడ ఫుల్ హ్యాపీగా పనిచేసుకోవచ్చు అని అంటున్నారు. అంతే కాదు జనసేనలో చేరితో ఒక బలమైన సామాజిక వర్గం అండ దొరుకుతుంది. ఏపీలో మొత్తం జనాభాలో పాతిక శాతం ఉన్న ఆ జనాభా లేకుండా గెలుపు తీరాలకు చేరుకోవడం ఎవరికైనా కష్టమే. అది జనసేనకు పునాదిగా ఉండడంతో ఆ వైపు వస్తున్నారు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే మెగాభిమానులు కూడా జనసేనలో నాయకులకు అండగా ఉంటారు. యువత మహిళ అభిమానులు కూడా ఆ పార్టీకి పెట్టని కోటగా ఉంటున్నాయి. ఇవన్నీ వెరసి సాలిడ్ ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ మాత్రం ఈ మాత్రం సొంత పలుకుబడి ఉండి కొన్ని ఓట్లు తమ వెంటే ఉంటే జనసేన ఓటు బ్యాంక్ తో దానిని మిక్స్ చేసి హాయిగా గెలవవచ్చు అన్నది చాలా మంది ఆలోచన.

అందుకే జనసేనలో చేరేందుకు వైసీపీ నేతలు అత్యధికం ప్రిఫర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక 2026లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య బాగా పెరుగుతుంది. దాంతో ఇలా జనసేనలో చేరిన వారికి టికెట్లు దక్కుతాయని కూడా భావిస్తున్నారు. రాజకీయ పరిణామాలు ఏమైనా మారి జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఇక తిరుగేలేదు అని భావించే ముందు చూపు ఉన్న వారు కళ్ళు మూసుకుని జనసేనకు ఓటు వేస్తున్నారు.

వీటికి మించి పవన్ కళ్యాణ్ దగ్గర తమకు గౌరవం ఉంటుందని ఆయన ఏమి చెప్పినా వింటారని కూటమిలో జనసేనకు ఉన్న ప్రాధాన్యత రిత్యా నామినేటెడ్ సహా కీలక పదవులు కూడా రానున్న కాలంలో అందుకోవచ్చు అని ఆశపడుతున్న వారు కూడా ఆ వైపు చూస్తున్నారు.

ఇక రాజకీయంగా అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వారు ఆలోచించేది ఏంటి అంటే ఏపీలో టీడీపీ కి ఆల్టర్నేషన్ గా జనసేన మాత్రమే ఫ్యూచర్ లో ఉంటుందని దాంతో పాటు పవన్ లో రాజకీయాల పట్ల ఉన్న తపన, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలు అన్నీ కలసి జనసేనను బలమైన పార్టీగా మారుస్తాయని భావించే అందులోకి వెళ్తున్నారు అని అంటున్నారు. సో ఏపీలో ఇపుడు హాట్ ఫేవరేట్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన అని చెబుతున్నారు.